Attacked On Judge In USA:అమెరికాలో కోర్టు రూమ్‌లో జడ్జిని చితక్కొట్టిన నిందితుడు

వాడొక నేరం చేసే కోర్టు మెట్లెక్కాడు. అతను చేసినదానికి జడ్జి శిక్ష కూడా వేయడానికి రెడీ అయింది. ఇంత జరుగుతున్నా తన బుద్ధిని మార్చుకోలేదు నిందితుడు. తీర్పును చెబుతున్న జడ్జి మీదనే ఏకంగా దాడికి దిగి చితక్కొట్టాడు. అమెరికాలోని లాస్ వేగాస్ రాష్ట్రంలో క్లార్క్ కౌంటీ కోర్టులో జరిగిందీ ఘటన.

New Update
Attacked On Judge In USA:అమెరికాలో కోర్టు రూమ్‌లో జడ్జిని చితక్కొట్టిన నిందితుడు

Shocking video:అమెరికాలో ఒక వీడియో ఇప్పుడు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. అత్యున్నత స్థానంలో ఉన్న జడ్జిని కోర్టు రూమ్‌లోనే అటాక్ చేయడం అందరినీ విస్మయానికి లోనుచేస్తోంది. అమెరికాలోని లాస్ వేగాస్ రాష్ట్రంలో క్లార్క్ కౌంటీలో జరిగిన ఈ సంఘటన తాలూకా వీడియో సోసల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

డియోబ్రా రెడెన్...ఇతనొక నేరస్థుడు. దొంగతనం, ఆస్తుల ధ్వంసం, గృహహింస కింద  ఇతని నేరాలు నిరూపితమయ్యాయి. ఈ కేసుల విషయంగానే రెడెన్ కోర్టుకు హాజరయ్యాడు. ఇతని తరుఫు లాయర్లు ఇతని నేరాలను మరోసారి పోలీసులు దర్యాప్తు చేసేందుకు , పరివీలించేందుకు అనుమతిని కోరారు. అయితే కేసును విచారిస్తున్న లేడీ జడ్జి మేరీ కే హోల్తస్ అందుకు నిరాకరించారు. నిందితునికి శిక్ష పడాల్సిందే అంటూ వ్యక్యానించింది. ఇదిగో ఈ విషయమే రెడెన్‌కు బాగా కోపం తెప్పించింది. జడ్జి మేరీ తీర్పు చదువుతుండగానే పెద్దగా అరుచుకుంటూ వెళ్ళి ఆమెపై అటాక్ చేశాడు.

Also read:దద్దరిల్లుతున్న దండకారణ్యం..ఛత్తీస్ ఘడ్ లో ఆపరేషన్ అబూజ్మడ్?

కోర్టు రూమ్‌లో కింద ఉన్న డియోబ్రా రెడెన్ నేరుగా జడ్జి కూర్చున్న ప్లేస్‌లోకి దూకి మరీ వెళ్ళి ఆమె మీద దాడి చేశాడు. జడ్జిని కిందపడేసి పిడిగుద్దులు కురిపించాడు. ఇది హాఠాత్తుగా జరగడంతో జడ్జి వెనకనే ఉన్న మార్షల్స్ స్పందించడానికి టైమ్ పట్టింది. ఈ లోపు రెడెన్ జడ్జి మేరీని చితక్కొట్టాడు. తరువాత కూడా అతనిని అక్కడ నుంచి తప్పించేందుకు మార్సల్స్ చాలా కష్టపాడాల్సి వచ్చింది. రెండుసార్లు వెనక్కి లాగినే మళ్ళీ తప్పించుకుని వచ్చి దాడి చేశాడు. అయితే అదృస్టవశాత్తు మేరీకి క్రానిక్ ఇంజురీస్ ఏమీ అవ్వలేదు. కానీ డియెబ్రాను ఆపడానికి ప్రయత్నించిన మార్షల్స్ కు మాత్రం చాలా గట్టిగానే దెబ్బలు తాకాయి. ఇందులో ఒకతనికి చేయి కూడా విరిగింది.

మేరీ కే హోల్తస్ 43 ఏళ్ళుగా పని చేస్తున్నారు. 2018 నుంచి క్లార్క్ కోర్డు జడ్జిగా ఉన్నారు. అంతకు ముందు డిస్ట్రిక్ట్ అటార్నీగా వర్క్ చేశారు మేరీ. మరో 16 ఏళ్ళు స్పెసల్ విక్టిమ్స్ యూనిట్ ప్రాసిక్యూటర్‌గా పని చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు