Chandra Babu: జూనియర్ ఎన్టీయార్ ట్వీట్‌కు చంద్రబాబు వైరల్ రిప్లై

జూ.ఎన్టీయార్ శుభాకాంక్షలు ట్వీట్‌కు వరుసగా అందరూ రిప్లైలు ఇస్తున్నారు. థాంక్యూ అమ్మా అంటూ మావయ్య చంద్రబాబు కూడా ఈరోజు ఎన్టీయర్‌కు రిప్లై ఇచ్చారు. అలాగే మరికొంత మంది సినీ స్టార్లకూ యన ట్విట్టర్లో రిప్లైలు పెట్టారు.

New Update
Chandra Babu: జూనియర్ ఎన్టీయార్ ట్వీట్‌కు చంద్రబాబు వైరల్ రిప్లై

Chandra babu Reply to Jr. NTR tweet: ఒక విజయం కుటుంబంలో మార్పులు తెచ్చిందా అంటే అవుననే అనిపిస్తోంది. ఈసారి ఎన్నికల్లో టీడీపీ గెలుపుతో జూ.ఎన్టీయార్, నారా కుటుంబాల మధ్య విభేదాలు తొలగినట్టే అనిపిస్తున్నాయి. ప్రస్తుతం గెలుపు సంబరాల్లో మునిగి తేలుతున్న చంద్రబాబు కుటుంబానికి ఎన్టీయార్ శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. దానికి వరుసపెట్టి నారా కుటుంబం, బాలకృష్ణ అల్లుడు అందరూ రిప్లే ఇచ్చారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎన్టీయర్‌కు జవాడు ఇచ్చారు. థాంక్యూ అమ్మా అంటూ ఆప్యాయంగా రిప్లే ఇచ్చారు. ఇది చూసి నారా, నందమూరి కుటుంబ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇప్పటితో అయినా ఇరువురి మధ్య గొడవలు పద్దుమణుగుతాయి అని భావిస్తున్నారు.

అందరికీ రిప్లైలు..

ఇక చంద్రబాబు జూ. ఎన్టీయార్ ట్వీట్‌తో పాటూ మిగతా అందరి ట్వీట్లకూ రిప్లై ఇచ్చారు. విక్టరీ వెంకటేష్‌కు థాంక్యూ వెంకీ మామ అంటూ..థాంక్యూ డియరెస్ట్ ఫ్రెండ్ అంటూ రజనీకాంత్‌కూ..నాగార్జునకూ, మంచు మనోజ్‌కూ చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

Also Read:Andhra Pradesh: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీ మార్పు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tirumala : తిరుమలకు కార్లలో వెళుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పని సరి...

తిరుమతితో పాటు ఇతర ప్రాంతాలను దర్శించుకోవడానికి కార్లలో వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల తిరుమలకి వస్తున్న రెండు కార్లు దగ్ధం అయ్యాయి. దీంతో వేసవికాలం కార్లలో వెళ్లే వారు జాగ్రత్తలు తీసుకోవాలని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు సూచిస్తున్నారు. 

New Update
thirumla tirupathi devasthanam

thirumla tirupathi devasthanam

Tirumala : పిల్లలకు వేసవి సెలవులు ఇవ్వడంతో చాలామంది దైవదర్శనానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.ఎక్కువమంద తిరుమలను దర్శించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఎక్కువమంది బస్‌లు, ట్రైన్‌లలో వెళ్తున్నప్పటికీ తిరుమతితో పాటు ఇతర ప్రాంతాలను దర్శించుకోవాలనుకునేవారు కార్లలో వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే వేసవికాలం కావడంతో కార్లలో వెళ్లే వారు జాగ్రత్తలు తీసుకోవాలని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు సూచిస్తున్నారు.  ఇటీవల ఎండాకాలం లో తిరుమలకి వస్తున్న రెండు కార్లు దగ్ధం అయ్యాయి, అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ రెండు కార్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఈ విధంగా కార్లు దగ్ధం అవడానికి పలు కారణాలున్నాయి. కాబట్టి తమ సూచనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ కోరారు. 

Also read: Murder case: కొడుకు అక్రమ సంబంధానికి బలైన తండ్రి.. వాడి పెళ్లం ఫొటోలు వాట్సాప్ స్టేటస్‌

తిరుమల ఘాట్ రోడ్డులో 500 కిలోమీటర్లపాటు ప్రయాణించిన తర్వాత కార్లు ఎక్కువ వేడెక్కడం లేదా మంటలు అంటుకోవడం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలిపారు.  దీర్ఘదూర ప్రయాణం ఇలా కార్లు దగ్ధం కావడానికి కారణమవుతోందని పోలీసులు తెలిపారు. సుమారు 500కిమీ ప్రయాణం తర్వాత ఇంజిన్ ఆప్పటికే వేడిగా ఉంటూ ఒత్తిడిలో ఉంటుందని,తక్షణమే తిరుమల ఘాట్ పైకెక్కడం ప్రారంభిస్తే, ఇంజిన్, ట్రాన్స్‌మిషన్‌కు అధిక వేడి వస్తుందని తెలిపారు. అలాగే కొండలు, వంకర రోడ్లు ఎక్కాలంటే అధిక ఇంజిన్ శక్తి అవసరమన్నారు. డ్రైవర్లు ఎక్కువగా తక్కువ గేర్లను ఉపయోగిస్తారని,దీంతో ఆర్పీఎం పెరిగి వేడి పెరుగుతుందన్నారు. దిగే సమయంలో తరచుగా బ్రేకింగ్ చేయడం వల్ల బ్రేక్ సిస్టమ్ వేడిగా మారుతుందన్నారు. 

ఇది కూడా చూడండి: Ind: వాణిజ్యం, టెక్నాలజీ..జేడీ వాన్స్ తో ప్రధాని మోదీ చర్చించిన అంశాలివే..

అలాగే అధిక లోడ్ తో వెళ్లే వాహనాలు కూడా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. తీర్థయాత్రలలో బరువు బ్యాగులు, ఎక్కువ మందిని తీసుకెళ్లడం సాధారణమని, ఇది ఇంజిన్‌పై ఒత్తిడిని పెంచి వేడి సమస్యలకు దారితీస్తుందన్నారు. అలాగే పాత వాహనాలు, సరిగా సర్వీస్ చేయని వాహనాలలో కూలంట్ లీక్‌లు , తక్కువ స్థాయి కూలంట్ ఉండటం, పాడైన రేడియేటర్లు లేదా ఫ్యాన్లు, థెర్మోస్టాట్ లోపాలు, పాడైన ఇంజిన్ ఆయిల్ కారణంగా కూడా ప్రమాదాలకు అవకాశం ఉందన్నారు. ఇవన్నీ ఇంజిన్ వేడి పెరగడానికి, తీవ్రస్థాయిలో అయితే మంటలు రావడానికి కారణమవుతాయన్నారు. 

Also Read:  Zelensky: చెప్పుకోవడానికే కాల్పుల విరమణ..దాడులు మాత్రం ఆగడం లేదు!

అలాగే ఇంధన లేదా ఎలక్ట్రికల్ సమస్యల వల్ల కూడా కార్లు ప్రమాదాలకు గురవుతాయన్నారు. ఇంధన పైపుల లీక్‌లు లేదా షార్ట్ సర్క్యూట్లు తీవ్రమైన వేడి ఉన్నప్పుడు మంటలు పుటించవచ్చన్నారు. దీర్ఘ ప్రయాణం తర్వాత ఉష్ణోగ్రతలు, వైబ్రేషన్లు సమస్యలను పెంచుతాయన్నారు. అలాగే కొంతమంది డ్రైవర్లు ఘాట్ ఎక్కిన వెంటనే వాహనాన్ని ఆపి ఇంజిన్ ఆఫ్ చేస్తారని, దీని వలన ఫ్యాన్ పని చేయదన్నారు. వేడి బయటకు వెళ్లదని, ఫలితంగా హీట్ సోక్ జరిగి మంటలు రావచ్చన్నారు. కాబట్టి టూర్ కు బయలుదేరే ముందు బండిని సర్వీసింగ్ చేయించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇంజన్ ఆయిల్, కూలెంట్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, ఏసీ ఆయిల్ తనిఖీచేయించాలన్నారు.

ఇది కూడా చూడండి: Ind: వాణిజ్యం, టెక్నాలజీ..జేడీ వాన్స్ తో ప్రధాని మోదీ చర్చించిన అంశాలివే..

 అలాగే రేడియేటర్ లీకేజీ తనిఖీచేయడం, ఫ్యాన్ బెల్ట్ సరిచూసుకోవడం, బ్యాటరీ లో డిస్టిల్ వాటర్ తనిఖీచేసుకోవడం, వైర్ల చుట్టూ చేరిన తుప్పు కడిగించుకోవడం చేయాలన్నారు. డ్రైవర్ ప్రతి రెండు గంటలకి ఒకసారి వాహనం ఆపి అయిదు నిమిషాల పాటు నడవడం, స్వల్ప వ్యాయామం చేయడం, బాగా మంచినీరు తీసుకోవడం, టి, అల్పాహారం సేవించడం చేయాలన్నారు. అలాగే సెల్ ఫోన్ మాట్లాడడానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. వాహన డ్యాష్ బోర్డు మీద ధర్మామీటర్, ఆయిల్ గేజ్ మీటర్ పరిశీలిస్తూ ఉండాలన్నారు. ఏవైనా ఎర్ర బ్లింకర్ కనపడగానే, బండి ఆపి తనిఖీ చేసుకోవాలని కోరుతున్నారు. ఘాట్ ఎక్కే ముందు కనీసం 30 నిమిషాలు వాహనానికి విశ్రాంతి ఇవ్వాలని సూచిస్తున్నారు. ఎక్కే సమయంలో ఏసీ ఆఫ్ చేయాలని కూడా సూచిస్తున్నారు. కూలంట్, ఇంజిన్ ఆయిల్, బ్రేకులు బాగున్నాయో లేదో ముందే తనిఖీ చేసుకోవాలని కోరుతున్నారు. బండి దిగే సమయంలో ఎక్కువగా బ్రేక్ వాడకుండా, ఇంజిన్ బ్రేకింగ్ వాడమని సూచిస్తున్నారు.  

ఇది కూడా చూడండి: Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు అంతగా బాగోలేదు..జాగ్రత్తగా ఉంటే బెటర్‌!

Advertisment
Advertisment
Advertisment