Amit Shah : రిజర్వేషన్ల రద్దు మీద హోంమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో..కేసులు నమోదు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెబుతున్నట్టుగా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఇది నకిలీ వీడియో అని అమిత్ షా అలా మాట్లాడలేదని ఆరోపించింది. దీంతో ఈ నకిలీ వీడియో మీద హైదరాబాద్, ఢిల్లీలో కేసులు నమోదు చేశారు.

New Update
Amith Shah: యూనిఫామ్ సివిల్ కోడ్‌ను అమలు చేస్తాం- అమిత్ షా

Amit Shah Speech On Reservations : తాము మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) చెబుతున్నట్టుగా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియా(Social Media) లో వైరల్ అవుతోంది. ఇందులో అమిత్ షా ముస్లిం రిజర్వేషన్లతో పాటూ ఎస్టీ , ఎస్టీ రిజర్వేషన్లు కూడా ఎత్తేస్తామని చెప్పినట్టు ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. పెద్ద దుమారమే చెలరేగింది. దీంతో బీజేపీ(BJP) దీని మీద స్పందించింది. అమిత్ షా అలా మాట్లాడలేదని... ఆయన వీడియోను ఎవరో మార్ఫింగ్ చేశారని ఆరోపించారు. దాంతో పాటూ తమ పార్టీ ప్రతిష్టను దెబ్బ తీసేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అమిత్ షాఈ నకిలీ వీడియోకు సంబంధించి హైదరాబాద్, ఢిల్లీ పోలీసులు కేసును నమోదు చేశారు. దీని మీద దర్యాప్తు ప్రారంభించారు. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో విచారణ వేగవంతంగా చేస్తున్నారు.

ఈ మార్ఫింగ్ వీడియో(Morphing Video) మీద కేసును నమోదు చేయడమే కాక త్వరలోనే అరెస్ట్‌లు కూడా జరుగుతాయని చెబుతున్నారు పోలీసులు. వీడియోలను షేర్ చేసిన వారిని అదుపులోకి తీసుకుంటామని..దేశ వ్యాప్తంగా అరెస్ట్‌లు జరగవచ్చని చెప్పారు. చాలా రాష్ట్రాల్లో అమిత్ షా వీడియో మీద కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇలాంటి దుష్ప్రచారాల వలన శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని అంటోంది ఎంహెచ్ఏ.

ఈ నెల 23న కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలో జరిగిన విజయ్ సంకల్ప్ సభలో పాల్గొన్నారు. అందులో ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన ఆ హక్కులను తిరిగి వారికే ఇచ్చేస్తాం అని అన్నారు. ఈవీడియోనే మార్ఫింగ్ చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్‌ను రద్దు చేస్తామని చెప్పినట్టుగా చేశారని బీజేపీ అంటోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడంతో కేంద్ర హోం శాఖ సీరియస్‌గా తీసుకుంది.

వీడియోపై ప్రధాని మోదీ వార్నింగ్..

మరోవైపు అమిత్ షా మార్ఫింగ్ వీడియో మీద ప్రధాని మోదీ కూడా సీరియస్ అయ్యారు. ఎన్నికల్లో ఓడిపోయే వారే ఇలాంటి పనులు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పనులు చేసేవారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇది తెలంగాణ కాంగ్రెస్ పనేనని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Also read:National: సూరత్ తర్వాత ఇండోర్.. మరో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ.

Advertisment
Advertisment
తాజా కథనాలు