China: కార్లు ఉబ్బుతున్నాయి జాగ్రత్త.. కార్లు ఉబ్బుతున్నాయి. వాటి ముందు బ్యానెట్లు బానాల్లా పొంగిపోతున్నాయి. చిన్న బ్రాండ్ల కార్లకే కాదు...ఆడిలాంటి పెద్ద పెద్ద బ్రాండ్ల పరిస్థితి కూడ ఇదే. చైనాలో ఇప్పుడు ఇదో పెద్ద వింతగా మారింది. కార్ల రంగు పోగుండా అతికిస్తున్న వినైల్ ఫిల్మ్ ఇందుకు కారణమని తెలుస్తోంది. By Manogna alamuru 15 Aug 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Cars Swelling In China: చైనాలో కార్లు అన్నీ ఉబ్బిపోతున్నాయి. కార్లకు కడుపొచ్చిందని ఇప్పుడు అక్కడ జనాలు ఆశ్చర్యపోతున్నారు, నవ్వుకుంటున్నారు. వీటికి సంబంధించి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద బ్రాండ్ల కార్లది కూడా ఇదే పరిస్థితి కావడంతో కొంత ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే ఈ కార్లు ఉబ్బడం..వాటిలో లోపాలు ఉండి కాదంట. తయారీ లోపమూ, కృత్రియ మేథ కూడా కాదని చెబుతున్నారు. దీనంతటికీ కారణం అక్కడ కార్ల మీద అంటించే వినైల్ ఫిల్మ్ వల్లే అని తేల్చారు. కార్లు రంగు పోకుండా ఉండడానికి, అందంగా కనిపించడానికి కార్ల మీద వినైల్ ఫిల్మ్ అతికిస్తారు. ఒకరకమైన గమ్‌తో వీటిని అంటిస్తారు. పలుచటి ట్రాన్సపెరెంట్ కవర్‌లా ఉంటుంది ఇది. ఇవి అతికించాక కూడా కార్లు వాటి ఒరిజినల్ లుక్‌లోనే ఉంటాయి. కానీ ఫుల్ ప్రోటెక్షన్ కలిగి ఉంటాయి. ఎప్పుడు కార్లకు చిన్న చిన్న డ్యామేజీలు జరిగితే ఒరిజినల్ కార్ పాడవకుండా ఈ వినైల్ ఫిల్మ్ కాపాడుతుంది. మన దేశంలో కూడా వీటి వాడకం ఇప్పుడు ఎక్కువైంది. ఖరీదైన కార్లు కొన్న వాళ్ళందరూ వినైల్ ఫిల్మ్‌ను తప్పకుండా వేయించుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ వినైల్ ఫిల్మ్ కారణంగానే కార్లు ఉబ్బుతున్నాయని చెబుతున్నారు. తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు.. కార్లు ఎక్కువ సేపు ఎండలో ఉంటే వినైల్ ఫిల్మ్ వెనుక అతికించిన గమ్ వ్యాకోచం చెందుతోంది. దాని కారణంగానే కార్లు ఇలా ఉబ్బుతున్నాయని చెప్పారు. ఈసారి చైనాలో చాలా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చైనాలోని కొన్ని ప్రాంతాల్లో గత రెండ్రోజులుగా 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. షాంఘైలో 40 డిగ్రీలు దాటింది. దాని కారణంగానే కార్లు ఇలా ఉబ్బుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనికి పరిష్కారం నాణ్యమైన ఫిల్మ్‌ను వాడడం, కార్లను ఎక్కువ సేపు ఎండలో ఉంచకపోవడమే అని చెబుతున్నారు. Also Read:Plastic: ఉప్పు, చక్కెరల్లో ప్లాస్టిక్..అన్ని బ్రాండ్లలో ఇదే తంతు #china #pregnant #cars #swelling మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి