Mumbai Indians: రోహిత్‌ శర్మ జట్టులో కొనసాగుతాడా? తేల్చేసిన ముంబై హెడ్‌ కోచ్!

MI కెప్టెన్సీ మార్పుపై ఆ జట్టు హెడ్‌ కోచ్‌ మహేల జయవర్ధనే స్పందించారు. అభిమానుల ఆగ్రహం న్యాయమైనదేనని.. కానీ ఇది ఏదో ఒక సమయంలో తీసుకోవలసిన నిర్ణయమేనని వివరించారు. నాయకత్వంలో మార్పు వచ్చినప్పటికీ రోహిత్ శర్మ జట్టులో కీలక పాత్ర పోషిస్తాడని జయవర్ధనే స్పష్టం చేశారు.

New Update
Pandya Vs Rohit: 'రోహిత్ శర్మ నా కింద...' పాండ్యా షాకింగ్‌ కామెంట్స్‌!

ముంబై ఇండియన్స్‌(Mumbai Indians) తీసుకున్న కెప్టెన్సీ మార్పు నిర్ణయంపై ఇప్పటికీ సెగ చల్లారలేదు. ఐపీఎల్‌(IPL) ఆక్షన్‌తో సమానంగా ఈ కెప్టెన్సీ మార్పుపై ఇప్పటికీ తీవ్రంగా చర్చ జరుగుతోంది. రోహిత్‌ శర్మ(Rohit Sharma) ఇంక రిటైర్‌మెంట్ ప్రకటించకుండానే అతని స్థానంలో హార్దిక్‌ పాండ్యా(Hardik Pandya)కు కెప్టెన్సీ ఇవ్వడం పట్ల ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సోషల్‌మీడియాలో నిరసన వ్యక్తం చేస్తూ ముంబై ఇండియన్స్‌ సోషల్‌మీడియా హ్యాండిల్స్‌ను అన్‌ఫాలో చేస్తున్నారు. కొందరు ముంబై ఫ్రాంచైజీపై ఆగ్రహంలో MI జెర్సీలను తగలబెట్టారు కూడా. గుజరాత్‌ నుంచి ట్రేడ్‌ చేసుకొని తెచ్చుకున్న పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. తాజాగా దీనిపై ముంబై ఇండియన్స్ క్రికెట్ గ్లోబల్ హెడ్, మహేల జయవర్ధనే స్పందించారు.

Also Read: బ్యాటర్లకు ఇక కళ్లెం.. బీసీసీఐ తాజా నిర్ణయంతో పేసర్లకు అడ్వాంటేజ్!

ఇది కఠినమైన నిర్ణయమే:
అభిమానుల నుంచి ఉద్వేగభరితమైన ప్రతిస్పందనను గుర్తించిన జయవర్ధనే ఫ్రాంచైజీ భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. జియో(JIO) సినిమాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జయవర్ధనే ఈ కామెంట్స్ చేశారు. ఇది చాలా కఠినమైన నిర్ణయమని అభిప్రాయపడ్డ జయవర్ధనే.. అభిమానుల రియాక్షన్‌ను అర్థం చేసుకుంటునట్టు చెప్పారు. 'ఇది ఎమోషనల్‌గా ఉంది, నిజాయితీగా ఉంటుంది.. ప్రతి ఒక్కరూ భావోద్వేగంగా ఉంటారని నేను భావిస్తున్నాను' అని తెలిపారు. నాయకత్వంలో మార్పు వచ్చినప్పటికీ రోహిత్ శర్మ జట్టులో కీలక పాత్ర పోషిస్తాడని జయవర్ధనే స్పష్టం చేశారు.

హార్దిక్ పాండ్యా చాలా కాలంగా డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నాడని జయవర్ధనే గుర్తు చేశారు. ఆల్‌రౌండర్‌గా పాండ్యా ఎలా రాణించగలడో అందరికి తెలుసని చెప్పుకొచ్చారు. గుజరాత్‌ టీమ్‌కు పాండ్యా నాయకత్వం వహించాడని.. అతని అనుభవంతో ఉపయోగపడుతుందని తెలిపారు. కెప్టెన్సీ మార్పు అన్నది ఏదో ఒక సమయంలో మనం తీసుకోవలసిన నిర్ణయమేనని జయవర్ధనే వివరించారు. మైదానంలో, గ్రౌండ్‌ వెలుపల రోహిత్ జట్టులో ఉండటం తమకు చాలా ముఖ్యమన్నాడు. 'రోహిత్‌ చాలా తెలివైనవాడు. అతను దానిని నడిపించే వారసత్వంలో భాగం అవుతాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను' అని జయవర్ధనే ధృవీకరించారు.

Also Read: ఐపీఎల్ లో మొట్టమొదటి ట్రైబల్ ఆటగాడు..రాబిన్ మింజ్

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు