Health Benefits: కర్పూరం, కొబ్బరి నూనెతో కుదుళ్ళకి ఎంతో బలం..ఎలాగో తెలుసా..?

కర్పూరాన్ని చాలామంది దేవుడి హారతికి ఉపయోగిస్తారు. కర్పూరం వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థిక నష్టం వంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుదంని చెబుతున్నారు. రోజు కర్పూరం పొడి, కొబ్బరి నూనె పేస్టులా చేసి జుట్టు కుదురులకు మర్దన చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది.

New Update
Health Benefits: కర్పూరం, కొబ్బరి నూనెతో కుదుళ్ళకి ఎంతో బలం..ఎలాగో తెలుసా..?

హిందూమతంలో భగవంతుడిని ప్రతిరోజూ పూజ చేసే సమయంలో పసుపు- కుంకుమ, పువ్వులు, దీపంతో పాటు కర్పూరాన్ని ఉపయోగిస్తారు. అయితే.. ఈ కర్పూరానికి మండే స్వభావాన్ని కలిగి ఉంటుంది. తెలుపు రంగులో పుల్లని రుచితో ఈ కర్పూరం ఉంటుంది. దీనిలో నుంచి వచ్చే పొగ ఎంతో సువాసనగా ఉంటుంది. చిన్నమును కంపోరా అనే చెట్టు బెరడు నుంచి ఈ కర్పూరాన్ని తయారు చేస్తారు. 50 సంవత్సరాలకుపైగా ఆ చెట్ల నుంచి జిగురులాంటి అనే పదార్థాన్ని తీసుకుని కర్పూరం నూనెతో తయారు చేస్తారు. ఈ చెట్లు ఎక్కువగా జపాన్, ఇండోనేషియా ఆసియాలోని పలు దేశాల్లో అధికంగా పెరుగుతాయి. అయితే.. ఆయుర్వేదంలో కర్పూరాన్ని ఎక్కువగా ఉపయోగి పలు రకాల మందులు తయారు చేస్తారు.

ఇది కూడా చదవండి: జ్వరం తగ్గిన తర్వాత నోరు చేదుగా ఉంటుంది ఎందుకు..చేదు పోవాలంటే..?

దురదలు ఉంటే కర్పూరం నూనె త్వరగా తగ్గిస్తుంది. ఇంట్లో పురుగులు, బొద్దింకలు రాకుండా ఉండేందుకు ఎక్కువగా కర్పూరాన్ని వాడుతారు. కర్పూరం పూజతో పాటు చర్మం, వెంట్రుకలకు మేలు చేస్తుందని ఆయుర్వేదం నిపుణులు చెబుతున్నారు. కర్పూరం నూనె నొప్పులతో పాటు వాపులను కూడా తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఆయా సమస్యలకు కర్పూరం నూనెను రాస్తే నొప్పి నుంచి ఉపసనం ఉంటుంది. చాలామందికి చర్మం ఎర్రగా ఉండి దురద ఎక్కువగా వస్తాయి..అలాంటివారు కర్పూరాన్ని ఉపయోగిస్తే దురదలు, దద్దుర్లు, ఎర్రగా మారడం వెంటనే తగ్గుతాయి. అంతేకాకుండా కొబ్బరినూనెలో కొద్దిగా కర్పూరం వేసి నూనెను వేడి చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఇబ్బంది ఉన్న దగ్గర రాస్తే కొన్ని రోజులకు మంచి ఫలితం లభిస్తుంది.

రక్త సరఫరా పెరిగి జుట్టు బాగా పెరుగుతుంది

కర్పూరం నూనె ఫంగస్‌తో వచ్చే సమస్యలను తగ్గించేందుకు బాగా ఉపయోగపడుతుంది. ఫంగస్ ఉన్న దగ్గర కర్పూరం నూనెను రాస్తే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. పెద్దలతో పాటు చిన్నారుల్లో గజ్జి సమస్యలు ఉంటుంది. ఈ గజ్జిని తగ్గించేందుకు కర్పూరం చాలాబాగా పనిచేస్తుంది. అంతేకాకుండా నొప్పి, వాపు ఉంటే వెంటనే తగ్గిపోతాయి. కర్పూరాన్ని లోషన్లు, ఆయింట్మెంట్ల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. నిద్ర సమస్య నుంచి బయటపడేందుకు కర్పూర వాసన పిలిస్తే నిద్ర పడుతుంది. అంతేకాదు.. కర్పూరాన్ని వాడటం వల్ల దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ వాటినుంచి ఉపశమనం లభిస్తుంది. రోజూ కర్పూరం నూనెను చాతి, వెనుక భాగంలో మర్దన చేస్తే సమస్య పోతుంది. కర్పూరం నూనె జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. కర్పూరం నూనెలో వేరే హెయిర్ ఆయిల్‌లో కలిపి రోజు రాసుకోవాలి. దీని వలన తలలో రక్త సరఫరా పెరిగి జుట్టు బాగా పెరిగేందుకు కృషి చేస్తుంది. రాత్రిపూట కర్పూరం పొడి, కొబ్బరి నూనె పేస్టులా చేసి దాన్ని జుట్టు కుదురులకు మర్దన చేస్తే చుండ్రు ఉంటే పోతుంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఎంతకు తెగించావమ్మా.. భర్తపై కోపంతో 5 నెలల బిడ్డను నీటిలో ముంచి చంపేసింది!

తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. పుదుకోట్లై జిల్లాకు చెందిన మణికంఠన్ , లావణ్య దంపతులకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో లావణ్య భర్తపై కోపాన్ని బిడ్డపై తీర్చుకుంది. 5నెలల పసిబిడ్డను డ్రమ్ము నీటిలో ముంచి చంపేసింది.

New Update
Tamil Nadu incident mother killed 5 months baby

Tamil Nadu incident mother killed 5 months baby

తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. పుదుకోట్లై జిల్లాకు చెందిన మణికంఠన్ , లావణ్య దంపతులకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో లావణ్య భర్తపై కోపాన్ని బిడ్డపై తీర్చుకుంది. 5నెలల పసిబిడ్డను డ్రమ్ము నీటిలో ముంచి చంపేసింది. ఆ తర్వాత దొంగలు తన మెడలో బంగారు లాకెళ్లి బిడ్డను ఎత్తుకెళ్లారని కట్టు కథ అల్లింది. భర్త తనతో కాకుండా బిడ్డ పై ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడని తట్టుకోలేక ఆమె ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 

telugu-news | latest-news | crime | tamil-nadu
Advertisment
Advertisment
Advertisment