నష్టాలతో ప్రారంభమైన షేర్లు మార్కెట్లు.. కానీ లాభాల్లో ఈ స్టాక్‌లు.. వరుసగా స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. అమెరికా ఎన్నికల ఎఫెక్ట్ గట్టిగానే స్టాక్ మార్కెట్లపై పడింది. సెన్సెక్స్ 160 పాయింట్లు తగ్గి 78,515 దగ్గర ట్రేడవుతుండగా.. నిఫ్టీ 85 పాయింట్లు తగ్గి 23,798 దగ్గర ప్రస్తుతం కొనసాగుతోంది. By Kusuma 13 Nov 2024 | నవీకరించబడింది పై 13 Nov 2024 11:49 IST in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే సాగుతున్నాయి. ఈ రోజు కూడా స్టాక్ మార్కెట్లు నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో స్టాక్‌లు కూడా అంతంత మాత్రానే ఉన్నాయి. ఈ రోజు ఉదయం సెన్సెక్స్ 160 పాయింట్లు తగ్గి 78,515 దగ్గర ట్రేడవుతుంది. నిఫ్టీ 85 పాయింట్లు తగ్గి 23,798 దగ్గర కొనసాగుతోంది. ఇది కూడా చూడండి: Pawan Kalyan: పవన్ కు మరో కీలక బాధ్యత అప్పగించిన మోదీ! ఈ స్టాక్స్ కొనుగోలు చేస్తే.. ఐటీ, రియల్ బ్రాడర్ కాకుండా మిగతా ఆటో, ఎఫ్‌ఎంసిజి, మెటల్ అన్ని కూడా నష్టాల బాట పట్టాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం అయితే ఈ రోజు క్షీణించింది. ఈ రోజు ఎరిష్ లైఫ్ సైన్స్, అమీ ఆర్గానిక్స్ లిమిటెడ్, కెర్నెక్స్ మైక్రోసిస్టమ్స్ లిమిటెడ్, యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కూడా చూడండి: AP Rains: ఏపీపై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో వానలే..వానలు! సెన్సెక్స్ 30లో కొన్ని స్టాక్స్ నష్టాల్లో నడుస్తున్నాయి. ఎంఅండ్ ఎం, టాటా స్టీల్, మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా వంటి షేర్లు నడుస్తున్నాయి. భారతీ ఎయిర్‌టెల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ షేర్లు ప్రస్తుతం లాభాల్లో నడుస్తున్నాయి. ఇది కూడా చూడండి: బంగారం కొనుగోలు చేయడానికి మంచి అవకాశం.. భారీగా పడిపోతున్న పసిడి ధరలు ఇదిలా ఉండగా ఈ రోజు స్విగ్గీ ఐపీఓ షేర్లు మార్కెట్లో లిస్ట్ కానున్నాయి. స్విగ్గీ ఐపీఓ ధర రూ.370గా కంపెనీ నిర్ణయించింది. అయితే బీఎస్‌ఈలో ఈ షేర్లు రూ.412 దగ్గర స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం దీని ప్రీమియం మార్కింగ్ 5.64 శాతం ఉంది. రిటైల్ వర్గంలో 1.14 రెట్లు సబ్‌స్క్రిప్షన్ రేటు చూసింది. గ్రే మార్కెట్‌లో దీని ప్రీమియం విలువ 8 శాతంతో లిస్ట్ అయ్యాయి. ఇదికూడా చూడండి: కార్తీక పౌర్ణమి రోజు ఈ తప్పులు చేశారో.. దరిద్రమంతా మీ ఇంట్లోనే! #indian-stock-market #stock-markets #nifty #Snesex మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి