/rtv/media/media_files/f2dlAbI0W4HPewsQzSQd.jpg)
Stock Markets
నేడు స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు బలహీనంగా ఉండటంతో స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 127 పాయింట్లు నష్టంతో 77,444 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 42 పాయింట్ల నష్టంతో 23,551 వద్ద ఉన్నాయి.
ఇది కూడా చూడండి: Ganja: గంజాయి బ్యాచ్‌కు బిగ్ షాక్.. తాగినా, అమ్మినా పదేళ్ల జైలు శిక్ష, లక్ష జరిమానా!
ఈ షేర్లు లాభాల్లో..
సెన్సెక్స్ 30 సూచీలో కోటక్ మహీంద్రా బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, ఎస్‌బీఐ, టాటా స్టీల్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. ఎంఅండ్‌ఎం, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఇన్ఫోసిస్, సన్‌ఫార్మా, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎల్అండ్‌టీ, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, మారుతీ సుజుకీ, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
ఇది కూడా చూడండి: IPL 2025: SRHకు నిరాశ.. లక్నో సూపర్ జెయింట్స్ విక్టరీ
ఇదిలా ఉండగా కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొన్ని మార్పులు జరగనున్నాయి. ఆదాయపు పన్ను, క్రెడిట్ కార్డు, యూపీఐ సేవలు, టీడీఎస్ వంటి వాటిలో రూల్స్ మారనున్నాయి. కొత్త పన్ను విధానం ప్రకారం. రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ట్యాక్స్ ఉండదు. స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేలతో కలిపి మొత్తం రూ.12.75 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ లేదు.
ప్రస్తుతం 60ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు బ్యాంకుల్లో డిపాజిట్లపై వార్షిక వడ్డీ రూ.50వేలు దాటితే ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు దాన్ని రూ.లక్షకు పెంచారు. అలాగే 60 ఏళ్ల లోపు వారికి అయితే రూ.40 వేల నుంచి రూ.50వేలకు పెంచారు. LRS స్కీమ్ కింద ఆర్థిక ఏడాదిలో రూ.7 లక్షలు దాటితే టీసీఎల్ వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం దీన్ని రూ.10 లక్షలకు పెంచారు.
ఇది కూడా చూడండి: Bharat-America:అమెరికా నుంచి సాయం ఆగిపోతే కనుక ...10 లక్షల మరణాలు !
LATEST BUSINESS NEWS | latest-telugu-news | today-news-in-telugu | Stock Market Today | business news telugu