/rtv/media/media_files/2025/02/11/yRfB1iBsYU7oeHCYb0ju.jpg)
Stock Market
నేడు స్టాక్ మార్కెట్లు భారీగా కుప్పకూలాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. అయితే నేడు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఇన్వెస్టర్లు కేవలం ఈ ఒక్క రోజే రూ.4 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 850 పాయింట్లు నష్టపోయింది.
ఇది కూడా చూడండి: Allu Arjun: అల్లు అర్జున్ అంటే పిచ్చి.. అతడితో ఆ సీన్‌లలో అయినా ఓకే: టాలీవుడ్ హీరోయిన్!
కనిష్ట స్థాయిని తాకిన స్టాక్ మార్కెట్లు..
నేడు ఉదయం నుంచి ముగిసిన వరకు స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగాయి. ఒకనొక దశలో అయితే సెన్సెక్స్ 900 పాయింట్లకు పడిపోయి 74,387 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్ఠ స్థాయిని తాకింది. డాలర్‌తో రూపాయి విలువ రూ.86.720 వద్ద ముగిసింది.
ఇది కూడా చూడండి: AP Love case: ప్రియుడి కోసం పోటీ.. విషం తాగిన ఇద్దరు యువతులు.. చివరికి ఏమైందంటే!
ఆటో, ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాలు తప్పా మిగతా అన్ని రంగాల కంపెనీ షేర్లు భారీగా నష్టపోయాయి. ఐటీ, టెలికాం, లోహ రంగాల సూచీలు అయితే 2 శాతం వరకు నష్టపోయాయి. విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్ షేర్లు నేడు భారీగా నష్టపోయాయి. అయితే మహీంద్రా అండ్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, హీరో మోటార్స్, కోటక్ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి.
ఇది కూడా చూడండి: Kishan reddy: సీఎం రేవంత్ మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి స్టాక్ మార్కెట్లు నష్టాల బాటే ఎక్కువగా పడుతున్నాయి. ట్రంప్ టారిఫ్‌లు పెంచడంతో అమెరికలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చూడండి: Raja Saab Latest Updates: రాజాసాబ్ కోసం స్టార్ కమెడియన్స్.. ఈసారి థియేటర్స్ దద్దరిల్లాలి