ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇదే సమయంలో స్టాక్ మార్కెట్ ఈ రోజు గరిష్ట స్థాయి 77,899 నుండి 759 శాతం క్షీణించింది. ప్రస్తుతం సెన్సెక్స్ 400 పాయింట్ల పతనంతో 77,140 దగ్గర ట్రేడవుతుండగా..నిఫ్టీ 135 పాయింట్లు కోల్పోయింది. 30 సెన్సెక్స్ స్టాక్స్‌లో 20 క్షీణించగా, 10 పెరుగుతున్నాయి. 50 నిఫ్టీ స్టాక్‌లలో 35 క్షీణించగా, 15 పెరుగుతున్న దశలో ఉన్నాయి. NSE సెక్టోరల్ ఇండెక్స్‌లోని అన్ని రంగాలు క్షీణతతో ట్రేడవుతున్నాయి. ఇంతకు ముందు ఆటో, చమురు , గ్యాస్ రంగాల్లో ఉన్న పెరుగుదల కూడా ఇప్పుడు పడిపోయింది. నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్ 1.21% క్షీణతతో అత్యధికంగా ట్రేడవుతోంది. 2024 బడ్జెట్ ప్రసంగం టైమ్ లో కూడా ఇదే జరిగింది. గత ఏడాది కూడా బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు మార్కెట్ బాగా డౌన్ అయిపోయింది. తర్వాత సాయంత్రానికి కాస్త పుంజుకుంది.
Also Read: Union Budget 2025: గురజాడ వాక్యాలతో బడ్జెట్ ప్రారంభం