Stock Market:ఎట్టకేలకు లాభాల్లో సూచీలు..కాస్త మెరుగ్గా మార్కెట్ ఎట్టకేలకు దేశీ మార్కెట్ సూచీలు లాభాల్లోకి వచ్చాయి. సెన్సెక్స్ 218 పాయింట్లు, నిఫ్టీ 104 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. బ్యాంకింగ్ రంగంలో కొనుగోళ్ళు మార్కెట్‌ను లాభాల బాట పట్టించాయి. By Manogna alamuru 18 Oct 2024 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Stock Market: ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాల ఫలితాలు రావడంతో ఇండియన్ స్టాక్ మార్కెట్లు లాభాలబాట పట్టాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు తర్వాత కొనుగోళ్లు ఎక్కువ అవడంతో రోజు ముగిసేసరికి లాభాల్లోకి వచ్చాయి. ముఖ్యంగా ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో పాటు ఆటో షేర్లలో కొనుగోళ్లు ఈరోజు ఊపందుకున్నాయి. సెన్సెక్స్ రోజు కనిష్ట స్థాయి 80,409 నుంచి 815 పాయింట్లు కోలుకుంది. రోజు ట్రేడింగ్ అయ్యేసరికి 218 పాయింట్ల లాభంతో 81,224 దగ్గర ముగిసింది. నిఫ్టీ కూడా రోజు కనిష్ట స్థాయి 24,567 నుంచి 287 పాయింట్లు కోలుకుంది. నిఫ్టీ కూడా 104 పాయింట్లు లాభపడి 24,854 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో మెటల్, బ్యాంక్ రంగాలు భారీ వృద్ధిని నమోదు చేశాయి. Also Read: ఫుట్‌పాత్ ఆక్రమణలే టార్గెట్.. హైడ్రా నెక్ట్స్ యాక్షన్ ప్లాన్ ఇదే! Also Read: Isha ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట ఈరోజు ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మరియు టాటా మోటార్స్ షేర్ల హవా మార్కెట్‌లో కనిపించింది. అయితే ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీలు మాత్రం మార్కెట్‌ను దిగజార్చాయి. ఆసియా మార్కెట్‌లో జపాన్‌కు చెందిన నిక్కీ 0.18% పెరిగింది. కొరియాకు చెందిన కోస్పి 0.59% పతనం చెందగా.. చైనా యొక్క షాంఘై కాంపోజిట్ 2.91% పెరుగుదలతో ముగిసింది. ఇక నిన్న అమెరికాలోని డౌ జోన్స్ 0.37% పెరిగి 43,239 దగ్గర.. నాస్డాక్ 0.036% 18,373 దగ్గరా ముగిసాయి. S&P 500 0.017% తగ్గి 5,841కి చేరుకుంది. NSE డేటా ప్రకారం, విదేశీ పెట్టుబడిదారులు (FIIలు) అక్టోబర్ 17న ₹7,421.40 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అదే సమయంలో దేశీయ పెట్టుబడిదారులు (DIIలు) ₹ 4,979.83 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. Also Read: షేక్ హసీనాను మోదీ బంగ్లాదేశ్‌కి అప్పగిస్తారా? Also Read: మందు బాబులకు గుడ్ న్యూస్ #stock-market #stock-market-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి