ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఈ లోన్లపై వడ్డీ తగ్గింపు

ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్ తెలిపింది. రెపో లింక్డ్‌ లెండింగ్‌ రేటు, ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌ మార్క్‌ ఆధారిత లెండింగ్‌ రేట్‌‌ను 25 బేసిస్ పాయింట్లను తగ్గించింది. దీంతో హోమ్‌ లోన్స్‌, పర్సనల్‌ లోన్స్‌, ఇతర రిటైల్‌ లోన్స్‌పై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి.

New Update
SBI 2025 JOB notification

SBI

ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు గుడ్‌న్యూస్ తెలిపింది. ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించిన క్రమంలో రుణ రేట్లలో కోత విధించింది. రెపో లింక్డ్‌ లెండింగ్‌ రేటు, ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌ మార్క్‌ ఆధారిత లెండింగ్‌ రేట్‌‌ను 25 బేసిస్ పాయింట్లను తగ్గించింది. రెపో లింక్ రేటు 8.25 శాతానికి తగ్గింది. ఈబీఎల్‌ఆర్‌ 8.65 శాతానికి ఎస్‌బీఐ తగ్గించింది. అయితే ఈ రేట్లు అన్ని కూడా ఏప్రిల్‌ 15 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఇది కూడా చూడండి: Shiva Puja: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

ఇది కూడా చూడండి: HIT 3 Trailer: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

రెండోసారి బేస్ పాయింట్లను తగ్గించడంతో..

దీనివల్ల ఇప్పటికే రుణాలు తీసుకున్న వారితో పాటు కొత్త రుణాలు తీసుకునే వారికి కూడా ప్రయోజనం చేకూరనుంది. రెండోసారి బేస్‌ పాయింట్లను తగ్గించడంతో రెపో రేటు 6 శాతానికి చేరింది. ఈ క్రమంలో ఎస్‌బీఐ రుణ రేట్లను సవరించింది. గృహ రుణాలకు రెపోరేటును కలపడానికి ఈబీఎల్‌ఆర్‌ విధానాన్ని ఎస్‌బీఐ అనుసరిస్తోంది. ఎస్‌బీఐ ఈ విధానాన్ని 2019 అక్టోబర్‌ 1 నుంచి అనుసరిస్తోంది. ఈ విధానం అనుసంధానం వల్ల హోమ్‌ లోన్స్‌, పర్సనల్‌ లోన్స్‌, ఇతర రిటైల్‌ లోన్స్‌పై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. 

ఇది కూడా చూడండి:Aghori Audio Call Leak: రాధీ నావల్ల కావట్లేదే.. ఫస్ట్‌ వైఫ్‌తో అఘోరీ రాసలీలల ఆడియో లీక్.. ఒక్కసారి విన్నారంటే?

ఇది కూడా చూడండి: AP Crime: విశాఖలో దారుణం.. మరో 24 గంటల్లో డెలివరీ.. నిండు గర్భిణిని గొంతు పిసికి చంపిన భర్త!

 

Advertisment
Advertisment
Advertisment