/rtv/media/media_files/2025/02/16/OZC3L6cnWUC7mgp11ymq.jpg)
Galaxy A06 5G, Galaxy a36 5G, Galaxy A56 5G mobiles launching soon
ప్రముఖ టెక్ బ్రాండ్ సామ్‌సంగ్ త్వరలో అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పబోతుంది. తన లైనప్‌లో ఉన్న Galaxy A సిరీస్‌ను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో మొత్తం మూడు మోడళ్లు ఉన్నాయి. అందులో Galaxy A06 5G, Galaxy A36 5G, Galaxy A56 5G స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్‌ల మోడల్ కోడ్‌లు వెల్లడయ్యాయి. అవి వరుసగా a06x, a36xq, a56x కోడ్‌లతో రాబోతున్నట్లు సమాచారం.
Also Read : Gold Prices: ఎట్టకేలకు దిగొచ్చిన బంగారం ధర.. ఇదే గోల్డెన్ ఛాన్స్!
Galaxy A06 5G
సామ్‌సంగ్ నుండి సరసమైన స్మార్ట్‌ఫోన్ Galaxy A06 5G. ఇది GSMA డేటాబేస్ మోడల్ నంబర్‌లు SM-A066B/DS, SM-A066M/DSతో గుర్తించబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ 4GB RAM, అలాగే Android 15 ఫీచర్‌తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాకుండా.. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో కూడా వచ్చే ఛాన్స్ ఉంది.
Also read : Aashiqui 3: బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. టీజర్ అదిరింది! చూశారా
Galaxy A36 5G and Galaxy A56 5G
ఇక Galaxy A36 5G, Galaxy A56 5G స్మార్ట్‌ఫోన్‌లను మార్చి నాటికి లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లను భారతదేశంతో పాటు ఫ్రాన్స్, ఇతర దేశాలలో విడుదల చేయనున్నట్లు సమాచారం. Galaxy A36 5G స్మార్ట్‌ఫోన్ Android 15, 6GB RAMతో అందించబడుతుంది.
Also Read : Health: నెలరోజులు క్రమం తప్పకుండ ఈ పండు తింటే...బరువు పెరగరు!
అలాగే Samsung Galaxy A36 5G స్మార్ట్‌ఫోన్‌లో Snapdragon 6 Gen 3 లేదా Snapdragon 7s Gen 2 చిప్‌సెట్‌తో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇక A56 5G స్మార్ట్‌ఫోన్‌లో 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్, 5000mAh బ్యాటరీ, Exynos 1580 ప్రాసెసర్‌ని అందించవచ్చని సమాచారం. అంతేకాకుండా ఇది 50MP ట్రిపుల్ బ్యాక్ కెమెరాను కూడా పొందవచ్చని తాజా లీక్‌లు చెబుతున్నాయి.