/rtv/media/media_files/2025/03/12/xm1NhJFQCXSHXOaIwUAj.jpg)
Samsung Galaxy F16 5G Launched in India
ప్రముఖ టెక్ బ్రాండ్ శాంసంగ్ కొత్త కొత్త మొబైల్స్ లాంచ్ చేస్తూ దూసుకుపోతోంది. తాజాగా తన లైనప్‌లో ఉన్న మరో మొబైల్‌ను పరిచయం చేసింది. Samsung Galaxy F16 5G ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ Galaxy F16 5G ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో వస్తుంది. 25W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇక కెమెరా విషయంలోనూ ఎక్కడా తగ్గలేదు. తక్కువ ధరతో రిలీజ్ అయిన ఈ ఫోన అధునాతన, అత్యుత్తమ ఫీచర్లను అందిస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Samsung Galaxy F16 5G
Samsung Galaxy F16 5G ఫోన్ రూ. 11,499 ధరతో లాంచ్ అయింది. మార్చి 13న మధ్యాహ్నం 12 గంటల నుండి దేశంలో అమ్మకానికి వస్తుంది. దీనిని ఫ్లిప్‌కార్ట్‌లో కొనుక్కోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ బ్లింగ్ బ్లాక్, గ్లామ్ గ్రీన్, వైబింగ్ బ్లూ షేడ్స్‌లో వచ్చింది.
Also Read: రెచ్చిపోయిన పోలీసులు.. రచ్చ చేశారంటూ యువతకు గుండ్లు కొట్టించి ఊరేగింపు
Samsung Galaxy F16 5G Specifications
Samsung Galaxy F16 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల పూర్తి-HD+ (1,080 x 2,340 పిక్సెల్స్) సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఇది 8GB వరకు RAM, 128GB స్టోరేజ్‌తో వస్తుంది. Android 15-ఆధారిత One UI 7 తో వస్తుంది. 6 OS అప్‌గ్రేడ్‌లు, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్‌లను అందుకుంటుంది.
Also Read: ఏపీలో ఎండలు,వేడిగాలులు...ఈ జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలు!
ఇక కెమెరా విషయానికొస్తే.. Samsung Galaxy F16 5Gలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 5 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి. ఫోన్ ముందు భాగంలో 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇది 25W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G, Wi-Fi, బ్లూటూత్ 5.3, GPS వంటివి ఉన్నాయి.