ప్రముఖ మొబైల్ కంపెనీ రియల్‌మి మార్కెట్‌లోకి తాజాగా రంగుల ఫోన్‌ను విడుదల చేసింది. రెండు వేరియంట్లలో రియల్‌మి 14 ప్రో 5G సిరీస్‌ను లాంఛ్ చేసింది. రియల్‌మి 14 ప్రో, రియల్‌మి 14 ప్రో ప్లస్ అనే రెండు వేరియంట్లను కలర్ ఛేంజింగ్ వెర్షన్‌తో లాంఛ్ చేసింది. ఇప్పటికే ఈ ఫోన్ల బుకింగ్‌లు స్టార్ట్ అయ్యాయి. వీటిని రియల్‌మి ఇండియా అధికారిక వెబ్‌సైట్ లేదా ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ స్టోర్లలో కూడా కొనుగోలు చేయవచ్చు. అయితే 8GB+128GB వేరియంట్ ధర రూ. 24,999 ఉండగా, 8GB+256GB వేరియంట్‌లకు ధర రూ.26,999 ఉంది. వీటిపై డిస్కౌంట్ కూడా లభిస్తోంది.
ఇది కూడా చూడండి: Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధానికి బిగ్ షాక్.. 14 ఏళ్లు జైలు శిక్ష
రెండు వేరియంట్లలో..
రియల్‌మి 14 ప్రో 5G మొబైల్ 6.77 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తోంది. 120Hz రీఫ్రెష్ రేట్, 4500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. 8GB ర్యామ్, 128GB లేదా 256GB స్టోరేజీ వేరియంట్లలో ఈ మొబైల్ లభిస్తుంది. కెమెరా విభాగంలో 50MP, 16MP సెల్ఫీ కెమెరా కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 6000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. వీటితో పాటు మరిన్ని అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఇది కూడా చూడండి: Saif Ali Khan: సైఫ్ ను పొడిచిన కత్తి ఇదే.. ఎంత లోతు దిగిందంటే?
రియల్‌మి 14 ప్రో ప్లస్ 5G మొబైల్ 6.83 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తోంది. 120Hz రీఫ్రెష్ రేట్‌ని అందిస్తున్నారు. 8GB/12GB ర్యామ్ తోపాటు 128GB/256GB స్టోరేజీతో ఇస్తున్నారు. కెమెరా 50MPతో పాటు 6X లాస్‌లెస్ జూమ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. సెల్ఫీ 32MP కెమెరా ఇచ్చారు. మొబైల్‌కి 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 6000mAh బ్యాటరీ కూడా ఉంది.
ఇది కూడా చూడండి: Arvind Kejriwal: ప్రధానిమోదీకి కేజ్రీవాల్ సంచలన లేఖ.. ఏం చెప్పారంటే ?
ఇది కూడా చూడండి: Rinku Singh: పెళ్లికి సిద్ధమైన క్రికెటర్.. యంగ్ ఎంపీతో త్వరలో వివాహం