/rtv/media/media_files/2025/02/07/pxgd13mv6ZYIGKxDPxsN.jpg)
rbi repo rate
RBI Repo Rate: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గుడ్ న్యూస్ చెప్పింది. ఐదేళ్ల తర్వాత రెపోరేటును తగ్గించింది. మానిటరీ పాలసీ కమిటీ (MPC) ఈ రోజు జరిగిన సమావేశంలో రెపోరేటుపై 25 బేసిన్ పాయింట్లు్ మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రెపోరేటు 6.50 నుంచి 6.25కు తగ్గింది. ఒక బేసిస్ పాయింట్ 0.01%కి సమానం. తత్ఫలితంగా, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటు 6%గా ఉంటుంది.
Also Read : అయోధ్య రామాలయానికి పునాది వేసిన కామేశ్వర్ చౌపాల్ కన్నుమూత!
2020 మే తర్వాత తొలిసారి రెపో రేటు తగ్గింపు జరిగింది. గత రెండేళ్లుగా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేకుండా కొనసాగిన తరువాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ద్రవ్యోల్బణం కుదుటపడుతుందని ఆర్‌బీఎస్ గవర్నర్ సంజయ్ మల్హోత్ర తెలిపారు. 2024 ఫిబ్రవరి 8 నుంచి వడ్డీరేట్లు 6.50 శాతం వద్దే గరిష్ఠంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ద్రవ్యోల్బణం కుదుటపడుతుందని సంజయ్ మల్హోత్ర తెలిపారు.
Also Read: గిరిజన యువతులు నల్లగా, అంద వికారంగా.. ఒడిశా సీఎం చీప్ కామెంట్స్!
The Monetary Policy Committee (MPC) of the Reserve Bank of India (RBI), under the leadership of new Governor Sanjay Malhotra, announced a 25 basis point reduction in the repo rate, lowering it to 6.25%. pic.twitter.com/NchF1n1WAT
— News Daily 24 (@nd24_news) February 7, 2025
Also Read: Sekhar Basha: శేఖర్ బాషాకు బిగ్ షాక్.. మరో కేసు నమోదు..
రెపో రేటు తగ్గింపుతో..
వడ్డీరేట్ల తగ్గింపుతో ప్రజల చేతుల్లో డబ్బులు మిగులుతాయి. దీంతో వినియోగం పెరిగి ఎకానమీ పుంజుకోనుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితి సవాళ్లతో కొనసాగుతోందని ఆయన తెలిపారు. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం పురోగతి కాస్తా ఆగిపోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు. కాగా రెపో రేటు తగ్గింపుతో బ్యాంకులు తక్కువ వడ్డీ రేటు వద్ద రిజర్వ్ బ్యాంక్ నుంచి రుణాలు పొందుతాయి. ముఖ్యంగా గృహరుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలపై ఈ నిర్ణయం ప్రభావం చూపవచ్చు.