/rtv/media/media_files/2025/03/08/sRB3da3M75X68fVPmOfs.jpg)
POCO M7 5G smartphone available Rs 9,999
టెక్ బ్రాండ్ పోకో ఇటీవల తన లైనప్‌లో ఉన్న POCO M7 5G ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది. తాజాగా ఈ ఫోన్ మొదటిసారిగా సేల్‌కు వస్తోంది. ధరకు తగ్గట్టుగా ఈ ఫోన్ ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంది. దీనికి 50MP ప్రధాన కెమెరా ఉంది. సేల్ సమయంలో డిస్కౌంట్ ధరకు ఫోన్ కొనుగోలు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఆఫర్ వివరాలు తెలుసుకుందాం.
Also Read: అమెరికా కోర్టులో రాణాకు ఎదురు దెబ్బ.. ముంబై ఉగ్రదాడి కేసులో ఇండియా రావాల్సిందే
POCO M7 5G Sale Offers
POCO M7 5G కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభమైంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ. 10,499 నుండి ప్రారంభమవుతుంది. దీనిలో రెండు వేరియంట్లు ఉన్నాయి. వాటిలో 6 GB RAM/128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,499గా ఉంది. అలాగే 8GB RAM/128GB స్టోరేజ్ వేరియంట్ రూ.11,499కి కొనుగోలు చేయవచ్చు.
POCO M7 5G Discount
సేల్ ఆఫర్ కింద POCO M7 5G పై రూ.500 తగ్గింపు ఉంది. ఈ ఆఫర్‌తో ఫోన్‌ను రూ. 9,999 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా 8 GB RAM, 128 GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.10,999 కు కొనుక్కోవచ్చు. దీనితో పాటు బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై 5% క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది.
Also Read: అమ్మకానికి ప్రియాంక ఆస్తులు.. కోట్లలో డిమాండ్.. అదిమాత్రం చాలా కాస్ట్‌లీ!
Poco M7 5G Specifications
Poco M7 5G ఫోన్ 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 600 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఇందులో ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్ అమర్చబడింది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా Xiaomi HyperOSలో పనిచేస్తుంది. Poco M7 5G వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సెకండరీ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. అంతేకాకుండా ఈ ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అదే సమయంలో 18W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5160mAh బ్యాటరీతో వస్తుంది.