/rtv/media/media_files/2025/01/23/Lq3kBsK9sQd540m1SCVX.jpg)
NPS Vatsalya Photograph: (NPS Vatsalya)
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పిల్లల పేరిట ఓ గొప్ప పథకాన్ని అమలు చేసింది. దాని పేరు ఎన్‌పీఎస్ వాత్సల్య యోజన. ఈ ఫథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 కేంద్ర బడ్జెట్‌లో ప్రవేశపెట్టారు. ఈ స్కీమ్ ను దేశంలోని 75 ప్రాంతాల్లో ప్రారంభించారు. ఈ స్కీమ్ లో తల్లిదండ్రులు, సంరక్షకులు పిల్లల పేరుపై పెట్టుబడి పెట్టవచ్చు.ఈ పథకం కింద ఏడాదికి రూ. 1000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. పిల్లలకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల పెట్టుబడి ఆగిపోతుంది. మీరు ఈ పథకం కింద పెట్టుబడి పెడితే రూ.11 కోట్ల భారీ మొత్తం జమ అవుతుంది. అది ఎలా సాధ్యమో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఎన్‌పీఎస్ వాత్సల్య పథకం పెన్షన్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ద్వారా నిర్వహించబడుతుంది. మీరు ఈ పథకం కింద మీ పిల్లల పేరు మీద నెలకు రూ. 1,000 పెట్టుబడి పెడుతున్నారు అని అనుకుందాం, 18 సంవత్సరాల తర్వాత మొత్తం రూ. 2,16,000 అవుతుంది. ఏడాదికి 12.86% వడ్డీ రేటుతో డిపాజిట్ చేస్తే వడ్డీ ఆదాయం రూ.6,32,000 అవుతుంది. డిపాజిట్ మొత్తాన్ని వడ్డీతో కలిపితే మీకు రూ.8 లక్షల 48 వేలు వస్తాయి.
ఈ ప్లాన్ కింద, మీరు 20% క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం కూడా ఉంటుంది. మీరు యాన్యుటీ పథకం కింద మిగిలిన 80% అంటే రూ. 6.78 లక్షలు డిపాజిట్ చేస్తే, మీ డబ్బు రిటైర్‌మెంట్‌పై భారీ రాబడిని పొందుతుంది. మీరు ఈ పథకంలో నెలకు రూ. 10,000 పెట్టుబడి పెట్టి, 12.86% రిటర్న్ రేటుతో వడ్డీగా డిపాజిట్ చేస్తే, మీ పిల్లలు 60 ఏళ్లు వచ్చేసరికి రూ.11.5 కోట్లు పొందే అవకాశం ఉంది. ఎన్‌పీఎస్ వాత్సల్య స్కీమ్ అనేది మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన ఆర్థిక పునాదులు వేస్తుంది.