ప్రముఖ స్మార్ట్‌ఫోన్ నోకియా తయారీ సంస్థ HMD మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. తనలైనప్‌లో ఉన్న HMD Barbie Flip Phone ఫోన్‌ను త్వరలో భారతదేశంలో లాంచ్ చేయనుంది. ఈ ఫ్లిప్ ఫీచర్ ఫోన్ పింక్ కలర్‌లో బార్బీ అందాలను చూపిస్తూ అట్రాక్ట్ చేస్తుంది. ఒక్క ఫోన్ మాత్రమే కాకుండా.. వెనుక కవర్, ఛార్జర్, బ్యాటరీ వంటివి కూడా పింక్ కలర్‌లోనే ఉండటం గమనార్హం. ఫోన్‌లో బార్బీ థీమ్‌తో కూడిన యూజర్ ఇంటర్‌ఫేస్ కూడా ఉంది.
Also read: బంపరాఫర్.. ఆడపిల్లని కంటే తల్లిదండ్రులకు రూ.50 వేలు క్యాష్.. మగపిల్లాడైతే ఆవు గిఫ్ట్
HMD Barbie Flip Phone
HMD బార్బీ ఫ్లిప్ ఫోన్ ఇప్పటికే గ్లోబల్ వైడ్‌గా లాంచ్ అయింది. త్వరలో భారతదేశంలో లాంచ్ కానుందని కంపెనీ ట్విట్టర్ (X) లో తెలిపింది. అయితే దాని లాంచ్ తేదీని మాత్రం వెల్లడించలేదు. ఇదిలా ఉంటే ఈ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. దీని వెనుక కెమెరా LED ఫ్లాష్‌తో అందుబాటులో ఉంటుంది.
The HMD Barbie Flip Phone is coming soon to https://t.co/5sCGVniXdN
— HMD India (@HMDdevicesIN) March 9, 2025
Stay tuned to know more!#StayTuned #HMDBarbieFlipPhone #HMD #HMDIndia pic.twitter.com/CQvcWeMaJT
అంతేకాకుండా HMD బార్బీ ఫ్లిప్ ఫోన్ గ్లోబల్ వేరియంట్ 2.8-అంగుళాల QVGA స్క్రీన్, 1.77-అంగుళాల QQVGA కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది Unisoc T107 ప్రాసెసర్‌తో అమర్చబడి ఉంటుంది. 64MB RAM, 128MB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో అందించబడుతుంది. ఇంకా ఫోన్‌లో 0.3 మెగాపిక్సెల్ వెనుక కెమెరా ఉంటుంది. దీనికి LED ఫ్లాష్ యూనిట్ కూడా అందించారు. ఈ ఫోన్ చీకటిలో కూడా మెరుస్తుంది.
ఫోన్ ఆన్ చేసినప్పుడు 'హాయ్ బార్బీ' వాయిస్ వస్తుంది. అలాగే ఫోన్ బార్బీ-థీమ్ UIతో S30+ OSలో రన్ అవుతుంది. అంతేకాకుండా ఈ ఫోన్ 1,450mAh రిమూవబుల్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై 9 గంటల టాక్‌టైమ్‌ను అందిస్తుంది. ఇది 4G, బ్లూటూత్ 5.0, 3.5mm ఆడియో జాక్, USB టైప్-సి కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది. కాగా అమెరికాలో దీని ధర 129 డాలర్లు అంటే దాదాపు రూ.10,800గా కంపెనీ నిర్ణయించింది.