Financial Changes: అందరికీ అలెర్ట్.. ఏప్రిల్‌ 1 నుంచి కీలక మార్పులు

కొత్త ఆర్థిక సంవత్సరం మరికొన్నిరోజుల్లో ప్రారంభం కానుంది. ఏప్రిల్ 1 నుంచి కీలక మార్పులు రానున్నాయి. కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్ చట్టం, లేబర్ కోడ్స్, బడ్జెట్ ప్రతిపాదనలు, రైల్వే టికెట్ క్యానిలేషన్ రూల్స్‌ మారనున్నాయి.

New Update
Key financial changes kicking in from April

Key financial changes kicking in from April

కొత్త ఆర్థిక సంవత్సరం మరికొన్నిరోజుల్లో ప్రారంభం కానుంది. ఏప్రిల్ 1 నుంచి కీలక మార్పులు(Financial Changes April 1st 2026) రానున్నాయి. కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్ చట్టం, లేబర్ కోడ్స్, బడ్జెట్ ప్రతిపాదనలు, రైల్వే టికెట్ క్యానిలేషన్ రూల్స్‌(new-rules) మారనున్నాయి. ప్రతి సంవత్సరం ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో మార్పులు ఉంటాయి. కానీ ఈ ఏడాది మాత్రం ఎక్కువగానే మార్పులు ఉండనున్నాయి. అవేంటో ఈ ఆర్టికల్‌లో పూర్తిగా తెలుసుకుందాం.

Also Read :  పెట్రోల్ కష్టాలకు గుడ్ బై..! ఎలక్ట్రిక్ స్కూటర్ సేవింగ్స్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

1.ఆదాయపు పన్ను చట్టం 2025

ఆదాయపు పన్ను చట్టం, 1961 స్థానంలో కేంద్రం కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని తీసుకొచ్చింది. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 అమల్లోకి రానుంది. పన్నులు, పన్న శ్లాబులు మాత్రం అలాగే కొనసాగనున్నాయి. 

2.తగ్గనున్న టేక్ హోమ్
కొత్త లేబర్ కోడ్ రూల్స్ ప్రకారం ఉద్యోగి బేసిక్ శాలరీ అనేది జీతం మొత్తంలో కనీసం 50 శాతం ఉండాలి. దీనివల్ల పీఎఫ్, గ్రాట్యుటీ కంట్రిబ్యూషన్లు పెరగనున్నాయి. ప్రస్తుతం చాలా కంపెనీల్లో బేసిక్ పే 30 నుంచి 40 శాతం మాత్రమే ఉంది. 

3.పాన్‌ అప్లికేషన్‌కు మార్పులు 
ఇప్పటిదాకా పాన్ కార్డు పొందాలంటే ఆధార్ కార్డు ప్రూఫ్‌గా చూపించాలి. కానీ ఇప్పుడు ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, బర్త్ సర్టిఫికేట్ లాంటివి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. 

4.ఫ్యూచర్‌ అండ్‌ ఆప్షన్స్‌పై పెరగనున్న STT 
 ఫ్యూచర్స్‌పై సెక్యూరిటీస్‌ లావాదేవీల పన్ను (STT) 0.02 శాతం నుంచి 0.05 శాతానికి పెరగనుంది. అలాగే ఆప్షన్స్‌ ప్రీమియం, ఆప్షన్స్‌పై STT 0.01 శాతం నుంచి వరుసగా 0.15శాతం, 0.125 శాతానికి పెరగనుంది.

5.రూ.10 లక్షలు దాటితే పాన్ వివరాలు
ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ అకౌంట్‌లో రూ.10 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ నగదు ఒకేసారి లేదా విడతల వారీగా జమచేసినా లేదా ఉపసంహరించుకున్నా పాన్ వివరాలు సమర్పించాలి. ప్రస్తుతం రూ.50 వేలు దాటితేనే పాన్ వివరాలు అడుగుతున్నారు. 

6.ఇకనుంచి ట్యాక్స్‌ ఇయర్‌
గతంలో ఫైనాన్షియల్‌ ఇయర్‌ (FY), అసెస్‌మెంట్‌ ఇయర్‌గా (AY) వ్యవహరించేవారు. కానీ ఇకనుంచి ఏప్రిల్‌ 1 నుంచి మార్చి 31 వరకు ఉండే కాలాన్ని ట్యాక్స్‌ ఇయర్‌గా వ్యవహరించనున్నారు.

7.HRA 50 శాతం
ఇంటి అద్దె భత్యం (HRA) కింద తమ మూల వేతనంలో 50 శాతం పన్ను మినహాయింపు పొందే నగరాలను 4 నుంచి 8కి పెంచింది. ఇప్పటిదాకా ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై నగరాలకే ఉండగా.. ఇప్పుడు హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్, బెంగళూరు నగరాలకు కూడా విస్తరించారు. HRA కింద మినహాయింపు పొందాలంటే అద్దెదారు, ఇంటి యజమాని మధ్య ఉన్న అద్దె ఒప్పందం, పాన్ వివరాలు ఇవ్వాలి. ఇది పాత పన్ను విధానం ఎంపిక చేసుకున్న వాళ్లకే 

8.ఇళ్లు, స్థలాల అమ్మకం, కొనుగోలు,  బహుమతి, ఉమ్మడి డెవలప్‌మెంట్‌ ఒప్పందాల అంశంలో లవాదేవీ విలువ  రూ.20లక్షలు దాటితే పాన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా ఇది రూ.10 లక్షలు మాత్రమే ఉంది. 

9.టూ వీలర్‌ వెహికిల్, కారు, ఇతర ఏ వాహనమైనా దాని ధర రూ.5 లక్షలు దాటితే కొనుగోలుదారుడు పాన్ సమర్పించాలి. పాత చట్టంలో టూ వీలర్ వెహికిల్‌కు ఈ రూల్ ఉండేది కాదు. 

10.హోటళ్లు, రెస్టారెంటు బిల్లులు, ఈవెంట్ మేనేజ్‌మెంట్‌ కంపెనీలకు చెల్లింపులు రూ.లక్షల దాటినా పాన్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇది రూ.50 వేలు మాత్రమే ఉంది. 

11.బీమా పాలసీ కొనుగోలు కోసం వార్షిక ప్రీమియం రూ.50 వేలు దాటితే పాన్‌కార్డు అడుగుతున్నారు. ఇకనుంచి ప్రతి పాలసీకి కూడా పాన్‌ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. 

12.పంజాబ్ నేషనల్ బ్యాంక్ రోజువారీ ATM నగదు విత్‌డ్రా పరిమితుల్లో మార్పులు చేసింది. ఎంపిక చేసిన డెబిట్ కార్డులపై నగదు విత్‌డ్రా పరిమితిని 50 శాతం తగ్గించింది.

13.మార్చి నెలలో వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.60, వాణిజ్య సిలిండర్‌ రూ.114.5 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 1న కూడా ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలను కేంద్రం మరోసారి సవరించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read :  ఈ ఫోన్ నిజంగా గేమ్ ఛేంజర్! డిజైన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.. బడ్జెట్ ఎంతంటే..?

14.రైలు టికెట్ క్యాన్సిలేషన్ రూల్స్‌లో మార్పులు 
రైలు ప్రయాణానికి 8 గంటల లోపల టికెట్‌ను రద్దు చేస్తే రిఫండ్ రాదు. ఇంతకుముందు ఇది 4 గంటలే ఉండేది. రైలు బయలుదేరడానికి 24 గంటల ముందు నుంచి 8 గంటల మధ్య టికెట్‌ రద్దు చేసుకుంటే 50 శాతం, 72 నుంచి 24 గంటల మధ్య రద్దు చేసుకుంటే 25 శాతం మొత్తం మినహాయిస్తారు. రైలు బయలుదేరేందుకు 72 గంటల సమయం ఉండగా టికెట్లు ఎప్పుడు రద్దు చేసుకున్నా కూడా క్యాన్సిలేషన్ రూసుము మినహాయిచి మిగిలిన మొత్తం రిటర్న్ వస్తుంది. 

Advertisment
తాజా కథనాలు