/rtv/media/media_files/2025/02/08/uPMNK1EcyKnDZT40uuaT.jpg)
iPhone 15 available on Flipkart with rs 30,000 discount
ఐఫోన్ అంటే అందరికీ ఇష్టమే. కానీ అధిక ధర కారణంగా చాలా మంది కొనాలనే కోరికను ఆపుకుంటారు. ఎప్పుడైనా ఆఫర్లు, డిస్కౌంట్లు ఉంటే అప్పుడు కొనొచ్చులే అని లైట్ తీసుకుంటారు. మీరు కూడా అలానే ఫీలవుతున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15పై క్రేజీ ఆఫర్, కళ్లు చెదిరే డిస్కౌంట్స్ అదుబాటులో ఉన్నాయి.
Also Read: ముఖ్యమంత్రి చంద్రబాబు- నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ మధ్య ఆసక్తికర చర్చ ..
IPHONE 15 Discount
పలు ఆఫర్లతో IPHONE 15 ఫోన్‌ను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. దీని 128జీబీ వేరియంట్
అసలు ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.69,900గా నిర్ణయించబడింది. అయితే ఇప్పుడు దీనిని 14 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.59,999లకే సొంతం చేసుకోవచ్చు. అంటే రూ.9,901 తగ్గింపు లభిస్తుందన్న మాట.
iphone 15 bank offers
అంతేకాకుండా పలు బ్యాంక్ ఆఫర్లు సైతం ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అలాగే HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు ఈఎంఐ పై రూ.1200 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అప్పుడు మరింత తక్కువ ధరకు ఇది లభిస్తుంది. ఇది కాకుండా భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. దాదాపు రూ.39,150 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ మొత్తం వర్తిస్తే ఐఫోన్ 15 ఫోన్‌ను కేవలం రూ.20,849లకే సొంతం చేసుకోవచ్చు.
Also Read: విజయసాయికి కేతిరెడ్డి కౌంటర్.. ఆ విషయం అందరికీ తెలుసంటూ సంచలన ట్వీట్!
అయితే ఈ మొత్తం డిస్కౌంట్ పొందాలంటే పాత ఫోన్ మోడల్ బట్టి ఎక్స్ఛేంజ్ ధర నిర్ణయిస్తారు. ఎలాంటి డ్యామేజ్ ఉండకూడదు. అప్పుడు మాత్రమే ఇంత డిస్కౌంట్ వర్తిస్తుంది. లేకపోతే మీ జేబులోంచి డబ్బులు పెట్టాల్సిందే.