/rtv/media/media_files/2025/03/20/wrF8W4o2DyEKRE484Wrr.jpg)
HMD Barbie Phone
HMD ఎట్టకేలకు భారతదేశంలో తన Barbie Flip ఫోన్‌ను విడుదల చేసింది. ఇది ఫీచర్డ్ ఫోన్. వింటేజ్ ఫ్లిప్ ఫోన్ డిజైన్‌ను కలిగి ఉంది. బార్బీ ఐకానిక్ శైలికి అనుగుణంగా దీన్ని పింక్ కలర్‌లో తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ఫోన్ ధర, ఫీచర్లు గురించి తెలుసుకుందాం.
Also read : హరీష్ రావుకు భారీ ఊరట...ఆ కేసు కొట్టివేసిన కోర్టు
HMD Barbie Flip Phone Specifications
HMD బార్బీ ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇది 2.8-అంగుళాల ప్రధాన స్క్రీన్‌ను, అలాగే చిన్న 1.77-అంగుళాల కవర్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ కాంపాక్ట్ మొబైల్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది 64MB RAM, 128MB స్టోరేజ్‌తో వస్తుంది. అదే సమయంలో 32GB వరకు ఎక్స్‌ట్రా స్టోరేజ్ విస్తరణకు మద్దతు ఇస్తుంది. Unisoc T107 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది.
Say hello to the ultimate HMD Barbie™ Flip Phone – it’s chic, it’s sleek, and yes, it’s PINK! 💖
— HMD India (@HMDdevicesIN) March 20, 2025
This isn’t just any phone; it’s a break from the digital noise, so you can reconnect with what really matters. Ready to pick up? 📞 Time to start living your dream life with the… pic.twitter.com/L43ZUpqI2l
Also Read: ఈసారి ఐపీఎల్ లో ఊపు మీదున్న బ్యాటర్లు..పెద్ద స్కోర్లు గ్యారంటీ
కెమెరా విషయానికొస్తే.. బార్బీ ఫోన్ LED ఫ్లాష్ యూనిట్‌తో 0.3MP వెనుక కెమెరాను కలిగి ఉంది. అంతేకాకుండా ఇది రెండు బ్యాక్ కవర్‌లను అందిస్తుంది. ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. అందులో ఒకటి 1992 టోటలీ హెయిర్ బార్బీ డాల్ నుండి ప్రేరణ పొందింది. మరొకటి వింటేజ్ 'షూటింగ్ హార్ట్' డిజైన్‌తో ఉంటుంది.
Also Read: రెండు ముక్కలుగా పాక్.. మరో దేశంగా అవతరించనున్న బలూచ్!
అంతేకాకుండా ఈ ఫోన్ కస్టమ్ బార్బీ వాల్‌పేపర్‌లు, యాప్ ఐకాన్‌లు, 'ఫ్లోటింగ్', 'డ్రీమ్‌హౌస్'లతో సహా అనేక రింగ్‌టోన్‌లతో వస్తుంది. బార్బీ ఫ్లిప్ ఫోన్ 1,450mAh రిమూవబుల్ బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది 9 గంటల వరకు టాక్‌టైమ్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ 4G, బ్లూటూత్ 5.0, 3.5mm ఆడియో జాక్, USB టైప్-Cకి మద్దతు ఇస్తుంది.
Also Read: ఢిల్లీ బ్యాడ్ లక్.. మూడోసారి కూడా ఫైనల్లో ఓటమే!
HMD Barbie Flip Phone Price
భారతదేశంలో విడుదలైన HMD బార్బీ ఫోన్ ధర విషయానికొస్తే.. ఇది రూ. 7,999 ధరతో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఇది భారతదేశంలో కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.