/rtv/media/media_files/2025/03/19/a6SdRLhzV9xrHIONBvPd.jpg)
Google Pixel 9a launched in India
టెక్ బ్రాండ్ గూగుల్ పలు ఫోన్లను భారత్‌లో లాంచ్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటుంది. ఇందులో భాగంగానే తాజాగా తన లైనప్‌లో ఉన్న మరో మోడల్‌ను పరిచయం చేసింది. బుధవారం తన కొత్త A-సిరీస్ స్మార్ట్‌ఫోన్ Google Pixel 9aను భారతదేశంతో పాటు ప్రపంచ మార్కెట్లలో విడుదల చేసింది. ఈ ఫోన్ Google Tensor G4 ప్రాసెసర్‌తో నడుస్తుంది. అలాగే ఇది Android 15తో వస్తుంది.
Also Read: రా కి రా.. సార్ కి సార్..! గ్రోక్ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!
Google Pixel 9a Price
భారతదేశంలో గూగుల్ పిక్సెల్ 9a ధర విషయానికొస్తే.. కంపెనీ ఈ ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఒకే వేరియంట్‌లో లాంచ్ చేసింది. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.49,999గా నిర్ణయించింది. కంపెనీ దీనిని ఐరిస్, అబ్సిడియన్, పియోనీ, పింగాణీ కలర్ ఆప్షన్‌లలో విడుదల చేసింది. ఈ ఫోన్ వచ్చే నెల నుండి సేల్‌కు అందుబాటులోకి రానుంది. కానీ అందుకు సంబంధించిన తేదీని కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
Also Read: పూరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ సేతుపతి..!
Google Pixel 9a Specifications
Google Pixel 9a ఫోన్ 6.3-అంగుళాల Actua pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. డ్యూయల్-సిమ్ (నానో+eSIM), ఆండ్రాయిడ్ 15తో నడుస్తుంది. ఈ ఫోన్‌లో టైటాన్ M2 సెక్యూరిటీ కోప్రాసెసర్‌తో 4th జెన్ టెన్సర్ G4 చిప్‌ను అమర్చారు. ఇది 8GB RAM - 256GB స్టోరేజ్‌ను కలిగి ఉంది.
Also Read: స్పీడ్ పెంచేసిన డ్రాగన్ బ్యూటీ.. మళ్ళీ ఆ హీరోతో రిపీట్..
ఈ ఫోన్ 1/2-అంగుళాల సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), క్లోజ్డ్-లూప్ ఆటోఫోకస్‌తో 48-మెగాపిక్సెల్ ప్రధాన వెనుక కెమెరాతో వస్తుంది. ఇది 8x వరకు సూపర్ రిజల్యూషన్ జూమ్‌కు మద్దతు ఇస్తుంది. అలాగే 13-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ కూడా ఉంది.
ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. అలాగే 45W పవర్ అడాప్టర్, 7.5W వైర్‌లెస్ (Qi) ఛార్జింగ్‌తో ఉపయోగించినప్పుడు 23W వద్ద ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,100mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. అంతేకాకుండా వీటితో పాటు ఈ ఫోన్ 7 సంవత్సరాల పాటు OS, సెక్యురిటీ అప్‌డేట్‌లను పొందుతుంది.