Gold Price: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధరలు

ఈ రోజు మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.550 తగ్గగా, 24 క్యారెట్లపై రూ.600 తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,200 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.78,760 గా ఉంది.

author-image
By Kusuma
New Update
gold,

బంగారం ధరలు నేడు భారీగా తగ్గాయి. పెళ్లిళ్ల సీజన్ మళ్లీ ప్రారంభం కావడంతో మహిళలకు ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.550 తగ్గగా, 24 క్యారెట్లపై రూ.600 తగ్గింది. ఈ రోజు మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,200 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.78,760 గా ఉంది. కేవలం బంగారం మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా తగ్గాయి. గత రెండు రోజుల నుంచి స్థిరంగా ఉన్న వెండి ధరలు నేడు కాస్త తగ్గాయి. ఈ రోజు మార్కెట్లో కిలో వెండి ధర రూ.93,000 గా ఉంది. బంగారం ధరలు తగ్గడంతో మహిళలు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అసలే పెళ్లిళ్ల సీజన్ మొదలు కావడంతో బంగారానికి మళ్లీ డిమాండ్ పెరుగుతోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఈ ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి. 

ఇది కూడా చూడండి: AP Budget 2024: ఏపీ బడ్జెట్లో అత్యధిక నిధులు బీసీలకే.. ఎన్ని వేల కోట్లో తెలుసా?

22 క్యారెట్ల బంగారం ధరలు

హైదరాబాద్ – రూ.72,200
విజయవాడ – రూ.72,200
ఢిల్లీ – రూ.72,350
చెన్నై – రూ.72,200
బెంగళూరు – రూ.72,200
ముంబై – రూ.72,200
కోల్‌కతా – రూ.72,200
కేరళ – రూ.72,200

ఇది కూడా చూడండి: TGఉపాధ్యాయ ఉద్యోగాల ఎంపికలో గందరగోళం...విధుల నుంచి మరో యువతి తొలగింపు!


24 క్యారెట్ల బంగారం ధరలు
హైదరాబాద్ – రూ.78,760
విజయవాడ – రూ.78,760
ఢిల్లీ – రూ.78,910
చెన్నై – రూ.78,760
బెంగళూరు – రూ.78,760
ముంబై – రూ.78,760
కోల్‌కతా – రూ.78,760
కేరళ – రూ.78,760

ఇది కూడా చూడండి: BREAKING: RGVకి చంద్రబాబు సర్కార్ షాక్.. ఏపీలో కేసు!

కిలో వెండి ధరలు
హైదరాబాద్ – రూ.1,02,000
విజయవాడ – రూ.1,02,000
ఢిల్లీ – రూ.93,000
ముంబై – రూ.93,000
చెన్నై – రూ.1,02,000
కోల్‎కతా – రూ.93,000
బెంగళూరు – రూ.93,000
కేరళ – రూ.1,02,000

ఇది కూడా చూడండి: Trump: పుతిన్‌కు ఫోన్ చేసిన ట్రంప్.. !

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. రియల్ ఎస్టేట్ కంపెనీల కుంభకోణంలో బిగ్ షాక్!

నటుడు మహేష్ బాబుకు ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. సురానా, సాయిసూర్య డెవలపర్స్ కేసులో ఏప్రిల్ 27న విచారణకు హాజరుకావాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ రెండు కంపెనీల నుంచి యాడ్స్ చేసేందుకు మహేష్ రూ.3.4 కోట్లు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. 

New Update

BIG BREAKING: నటుడు మహేష్ బాబుకు ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. సురానా, సాయిసూర్య డెవలపర్స్ కేసులో ఏప్రిల్ 27న విచారణకు హాజరుకావాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ రెండు కంపెనీల నుంచి యాడ్స్ చేసేందుకు రూ.3.4 కోట్లు తీసుకున్నట్లుగా ఈడీ గుర్తించింది. 

రూ.5.9 కోట్లు పారితోషికం.. 

ఈ మేరకు ఈ రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలు కొనుగోలుదారులను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఇందులో భాగంగానే మనీలాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోమవారం ఏప్రిల్ 27న నటుడు మహేష్ బాబుకు సమన్లు ​జారీ చేసింది. సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ ప్రచారం కోసం మహేష్ బాబు ఆమోదం తెలిపారని ఆరోపణలు ఉన్నాయి. సాయి సూర్య డెవలపర్స్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినందుకు ఆయన రూ.5.9 కోట్లు అందుకున్నారని ED వర్గాలు తెలిపాయి. ఇందులో రూ.3.4 కోట్లు చెక్కు ద్వారా, 2.5 కోట్లు నగదు ద్వారా చెల్లించారు. మోసపూరిత పద్ధతుల ద్వారా సేకరించిన లాండరింగ్ డబ్బులో భాగంగా ఈ నగదు భాగం ఉందని ED అధికారులు అనుమానిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Ind: వాణిజ్యం, టెక్నాలజీ..జేడీ వాన్స్ తో ప్రధాని మోదీ చర్చించిన అంశాలివే..

భాగ్యనగర్ ప్రాపర్టీస్ లిమిటెడ్ డైరెక్టర్ నరేంద్ర సురానా, సాయి సూర్య డెవలపర్స్ యజమాని కె. సతీష్ చంద్ర గుప్తా, ఇతరులపై తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ED తన మనీలాండరింగ్ దర్యాప్తును ప్రారంభించింది. అనధికార లేఅవుట్‌లలో ప్లాట్‌లను అందించడం, ఒకే ప్లాట్‌లను రెండు, మూడుసార్లు అమ్మడం, తప్పుడు రిజిస్ట్రేషన్ హామీలు ఇవ్వడం ద్వారా కొనుగోలుదారుల నుంచి ఈ సంస్థలు ముందస్తుగా కోట్లు వసూలు చేశాయని ఆరోపణలున్నాయి. ఈ వెంచర్ వెనుక ఉన్న మోసపూరిత పద్ధతుల గురించి తెలియక చాలా మంది పెట్టుబడి పెట్టేలా మహేష్ ప్రభావితం చేశారు. ఈ కుంభకోణం కార్యాచరణ అంశాలలో మహేష్ ప్రమేయం ఉండకపోవచ్చు, కానీ డెవలపర్ల నుంచి అతను అందుకున్న డబ్బును ED పరిశీలిస్తోంది.

ఇది కూడా చూడండి: Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు అంతగా బాగోలేదు..జాగ్రత్తగా ఉంటే బెటర్‌!

ఏప్రిల్ 16న జరిగిన సోదాల్లో, సురానా గ్రూప్ అధిపతి నరేంద్ర సురానా, సాయి సూర్య డెవలపర్స్ ప్రాంగణాల నుంచి పలు పత్రాలు, నగదు సంబంధిత ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు ED పేర్కొంది. ఈ పత్రాలు పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలను సూచిస్తున్నాయని, వీటిలో రూ. 100 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు ఉన్నాయని ED తెలిపింది.

 telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment