కొత్త సంవత్సరంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకనున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాదిలో పది గ్రాముల బంగారం ధర దాదాపుగా రూ.90 వేలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ యుద్ధాలు, గ్లోబల్ మార్కెట్‌లో అనిశ్చితల వల్ల బంగారానికి భారీగా డిమాండ్ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఇది కూడా చూడండి: Kadapa: న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం యుద్ధ సమస్యలు క్లియర్ అయితే.. అలాగే సెంట్రల్ బ్యాంకులు కూడా ఎక్కువగా బంగారం కొనే ఛాన్స్‌లు ఉన్నాయట. రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సమస్యలు క్లియర్ అయితే మాత్రం బంగారం ధరలు తగ్గే ఛాన్స్ ఎక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు. గతేడాది బంగారం ధరలు దాదాపు 23 శాతం పెరగ్గా, వెండి ధరలు 30 శాతం పెరిగాయి. ఇది కూడా చూడండి: Horoscope 2025: కొత్త ఏడాదిలో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. ఆ రాశుల లిస్ట్ ఇదే! ఈ ఏడాదిలో బంగారం ధరలు ఎక్కువగా పెరగకపోయిన కనీసం రూ.85 వేల నుంచి రూ.90 వేల వరకు అయిన పెరుగుతుందట. దీంతో పాటు వెండి ధర కూడా పెరగనుంది. రూ.1.1 లక్షల నుంచి రూ.1.25 లక్షలకు చేరుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో బంగారం ధరల్లో పెద్దగా మార్పులు రావని, కానీ తర్వాత ఆరు నెలల్లో మాత్రం ధరలు పెరుగుతాయని అంటున్నారు. ఇది కూడా చూడండి: AP: మద్యం దుకాణదారులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్ బంగారం ధరలను వడ్డీ రేట్లపై సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, డాలర్ విలువలు బట్టి ఉంటాయని కొందరు అంటున్నారు. వడ్డీ రేట్ల విషయంలో యూఎస్‌ఫెడ్ జాగ్రత్తగా ఉందని, దీనివల్ల పెద్దగా బంగారం ధరలు పెరగకపోవచ్చని భావిస్తున్నారు. యూఎస్‌ఫెడ్ ద్రవ్యోల్బణాన్ని 2 శాతానికి తగ్గించాలని ప్లాన్ చేస్తోంది. ఇదే కనుక జరిగితే బంగారం ధరలు తగ్గుతాయని అంటున్నారు. ఇది కూడా చూడండి: Musk: కొత్త సంవత్సర వేళ..పేరు మార్చుకున్న మస్క్..ఎంత వింతగా ఉందో చూడండి!