Gold Price : హమ్మయ్యా…బంగారం ధర తగ్గిందోచ్‌..ఎంతో తెలుసా!

బంగారం ధరలు 4 రోజుల తర్వాత స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములపై రూ.150 తగ్గి రూ. 68 వేల 650 వద్ద స్థిరంగా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు తులంపై రూ.160 మేర తగ్గడంతో ప్రస్తుతం రూ.74 వేల 890 పలుకుతోంది.

author-image
By Bhavana
New Update
Today Gold Rates

Gold Price : బంగారం కొనుగోలు చేసే వారికి ఓ గుడ్‌ న్యూస్‌..వరుసగా నాలుగు రోజులుగా పెరుగుతూ హడలెత్తించిన పుత్తడి ధరలు నేడు కొంచెం దిగి వచ్చాయి. ముందు రోజుతో పోలిస్తే బంగారం ధర స్వల్పంగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లలో గోల్డ్ రేట్లు రికార్డ్ గరిష్ఠాల నుంచి తగ్గుముఖం పడుతుండగా దేశీయంగా కూడా ఆ ప్రభావం కనిపిస్తోంది. ప్రస్తుతం పెళ్లిళ్ల ముహూర్తాలు లేకపోవడంతోనూ కొనుగోళ్లు కాస్త నెమ్మదిగా కొనసాగుతున్నాయని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 

అయితే, పండగల సీజన్ మొదలైన క్రమంలో దేశీయంగా బంగారం దిగుమతులు భారీగానే పెరిగాయి. గత ఆగస్టు నెలలో ఏకంగా 10.6 బిలియన్ డాలర్ల బంగారం దిగుమతి చేసుకున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ మంగళవారం గణాంకాలు విడుదల చేసింది. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే…

హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు 4 రోజుల తర్వాత స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములపై రూ.150 తగ్గి రూ. 68 వేల 650 వద్ద స్థిరంగా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు తులంపై రూ.160 మేర తగ్గడంతో ప్రస్తుతం రూ.74 వేల 890 పలుకుతోంది. ఇక ఢిల్లీ మార్కెట్లో చూసుకుంటే 22 క్యారెట్ల పసిడి ధర తులంపై రూ.150 తగ్గడంతో రూ.68 వేల 800 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల గోల్డ్ ఢిల్లీలో రూ.110 తగ్గాగ రూ. 75, 040 వద్ద కొనసాగుతుంది.

బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగానే తగ్గాయి. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1000 మేర తగ్గి రూ. 97 వేల వద్దకు దిగివచ్చింది. ఇక ఢిల్లీలో చూస్తే కిలో వెండి రేటు రూ. 1000 మేర దిగిరావడంతో ప్రస్తుతం కిలో రూ.92 వేలు గా కొనసాగుతుంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

భారీగా పెరిగిన బంగారం ధరలు.. 10 గ్రాముల బంగారం ఎంతంటే?

నేడు స్వల్పంగా పసిడి ధరలు పెరిగాయి. నిన్నటితో పోలిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.990 పెరిగి రూ.96170గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.88150గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. 

New Update
today gold rates

today gold rates

బంగారం ధరలు పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. నేడు స్వల్పంగా పసిడి ధరలు పెరిగాయి. నిన్నటితో పోలిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.990 పెరిగి రూ.96170గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.88150గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. 

ఇది కూడా చూడండి: Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

ఏ నగరంలో ధరలు ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.8,815 ఉండగా.. 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.9,617గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.8,815 ఉండగా.. 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.9,617గా ఉంది. న్యూఢిల్లీలో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.8,830 ఉండగా.. 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.9,632గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.8,815 ఉండగా.. 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.9,617గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.8,815 ఉండగా.. 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.9,617గా ఉంది.

ఇది కూడా చూడండి: Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.8,815 ఉండగా.. 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.9,617గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.8,815 ఉండగా.. 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.9,617గా ఉంది. పూణేలో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.8,815 ఉండగా.. 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.9,617గా ఉంది. బరోడాలో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.8,820 ఉండగా.. 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.9,622గా ఉంది. అహ్మాదాబాద్‌లో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.8,820 ఉండగా.. 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.9,622గా ఉంది.

ఇది కూడా చూడండి: MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

Advertisment
Advertisment
Advertisment