బంగారం ధరలు ఊహించని షాక్ ఇచ్చాయి. 2025 జనవరి 16వ తేదీ గురువారం రోజున భారీగా పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 పెరగగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.550 పెరిగింది. దీంతో10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73 వేల 900కు చేరుకోగా.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80 వేల 620కు చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
Also Read : ప్రాణం తీసిన పతంగులు.. నలుగురు మృతి
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర (Gold Rates) రూ. 74 వేలుగా ఉండగా.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80వేల 770 గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73 వేల900 గా ఉంది.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.80 వేల 620గా ఉంది.
ఇక హైదరాబాద్ విషయానికి వస్తే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73 వేల 900గా ఉండగా... 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.80 వేల 620 గా ఉంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73 వేల 900 గా ఉంది. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.80వేల 620గా ఉంది.
Also Read : మహా కుంభమేళాలో 'డిజిటల్ బాబా'..
వెండి ధరల విషయానికి వస్తే
ఇక వెండి ధరలు గురువారం రోజున ఊహించని రీతిలో పెరిగాయి. కేజీ వెండి ధర ఏకంగా రూ. 2000 పెరిగింది. ప్రస్తుతం మార్కెట్ లో కేజీ వెండి ధర లక్ష మూడు వేల రూపాయలుగా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కత్తాలలో కేజీ వెండి ధర రూ. రూ. 95వేల 500గా ఉంది. ఇక హైదరాబాద్ , చెన్నైలో ధర లక్ష మూడు వేల రూపాయలుగా ఉంది.
Also Read : సైఫ్ అలీ ఖాన్పై దాడి... ఎన్టీఆర్ షాకింగ్ రియాక్షన్
గమనిక : బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసేటప్పుడు మళ్లీ ధరలు చూసుకోవాల్సి ఉంటుంది.
Also Read : Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ సేఫేనా.. డాక్టర్లు కీలక ప్రకటన