పండగ పూట పసిడి ప్రియులకు అదిరిపోయే న్యూస్.. భారీగా తగ్గనున్న ధరలు

రాబోయే మూడేళ్లలో బంగారం ధరలు భారీగా తగ్గనున్నట్లు మార్నింగ్ స్టార్ రీసెర్చ్ సంస్థ స్థాపకుడు జాన్ మిల్స్ తెలిపాడు. మూడేళ్లలో 10 గ్రాముల బంగారం ధర 1820 డాలర్లకు పడిపోతుందట. మన ఇండియన్ కరెన్సీలో రూ.55 వేలు అన్నమాట.

New Update
Gold rates are decreased

Gold rates are decreased Photograph: (Gold rates are decreased)

ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తులం బంగారం లక్ష పైనే ఉంది. రోజూ కూడా ఆల్‌టైం రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. అయితే త్వరలో బంగారం ధరలు భారీగా తగ్గనున్నట్లు మార్నింగ్ స్టార్ రీసెర్చ్ సంస్థ స్థాపకుడు జాన్ మిల్స్ తెలిపాడు. రాబోయే మూడేళ్లలో 10 గ్రాముల బంగారం ధర 1820 డాలర్లకు పడిపోతుందని వెల్లడించారు. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.55 వేలు అన్నమాట. వచ్చే మూడేళ్లలో ఐటీ సెక్టార్‌లో ఎక్కువగా పెట్టుబడులు పెరుగుతాయి. దీంతో బంగారం ధరలు తగ్గుతాయని తెలిపారు. 

ఇది కూడా చూడండి:  Ugadi IPhone Offers: ఉగాది ఆఫర్లు.. IPHONE 15_ 6/512జీబీ ధర భారీగా తగ్గింపు- డోంట్ మిస్!

ఇది కూడా చూడండి: UGADI 2025: క్షణాల్లో ఉగాది పచ్చడి రెడీ .. బ్యాచిలర్స్ కూడా తయారు చేసేయొచ్చు!

ఇది కూడా చూడండి: Ugadi 2025 Tv Offers: ఉగాది స్పెషల్.. బ్రాండెడ్ 4k TVలపై బ్లాక్ బస్టర్ ఆఫర్లు- వదిలారో మళ్లీ దొరకవ్!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TESLA: దారుణంగా టెస్లా అమ్మకాలు...మూడేళ్ల కనిష్టానికి..

ట్రంప్ కు మేలు చేయాలని అనుకుని తనకు తానే కన్నం పెట్టుకుంటున్నాడు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. DOGE ద్వారా తీసుకున్న నిర్ణయాలతో ప్రజల వైపు నుంచి వ్యతిరేకత మూటగట్టుకున్నాడు. ఇప్పుడు అది టెస్లా మీద ప్రభావం చూపిస్తోంది. అమ్మకాలు బాగా తగ్గిపోయాయి.

New Update
Tesla Seeks Certification For Model Y And Model 3 To Enter Indian Market

Tesla Seeks Certification For Model Y And Model 3 To Enter Indian Market

అమెరికాలో టెస్లా మీద వ్యతిరేకత చాలా ఎక్కువైంది. ఎలాన్ మస్క్ ట్రంప్ ప్రభుత్వంలోకి వచ్చాక ఆయన తీసుకున్న నిర్ణయాల మీద యూఎస్ ప్రజలు గుర్రుగా ఉన్నారు. ఫెడరల్ ఉద్యోగాలు తగ్గించేయడం, పెద్ద పెద్ద సంస్థలను మూసేయడం లాంటివి ఆయన మీద వ్యతిరేకత పెరిగేలా చేశాయి. దాని ప్రభావం మస్క్ వ్యాపారాల మీద కూడా పడింది. ఎలాన్ మస్క్ మీద వ్యతిరేకతను చాలా మంది టెస్లా మీద చూపిస్తున్నారు. కొత్తగా కొనుక్కోవాలనుకున్నవాళ్ళు మానేస్తున్నారు. ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు కూడా అమ్మేస్తున్నారు. మరోవైపు కొత్తగా వస్తున్న మోడళ్ళ వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. ఇవన్నీ కలిపి టెస్లా విక్రయాలు పడిపోవడానికి కారణమయ్యాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 

అస్సలు అందుకోలేకపోయింది..

జనవరి నుంచి మార్చి వరకు టెస్లా విక్రయాలు 13 శాతం మేర క్షీణించి మూడేళ్ల కనిష్ఠానికి చేరాయి. దీని ప్రభావం వల్ల స్టాక్ మార్కెట్లో కూడా టెస్లా షేర్లు 6 శాతం పతనం అయ్యాయి. గతేడాది జనవరి- మార్చి త్రైమాసికంలో టెస్లా 3,86,810 యూనిట్లను విక్రయించింది. గతేడాదితో పోలిస్తే విక్రయాలు తగ్గినా 3.72 లక్షల కార్లు అమ్ముడయ్యే అవకాశం ఉందని అందరూ అంచనాలు చేశారు. కానీ ఈ మూడు నెల్లో కేవలం 3,36,681 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.  లాస్ట్ ఇయర్ కంటే ఈ ఏడాది 20 నుంచి 30 శాతం వృద్ధిని నమోదు చేస్తామని మస్క్ మాటిచ్చారు. కానీ ఆ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయారు. దీంతో కంపెనీ షేర్లు కూడా పతనం అయ్యాయి. 

మరోవైపు ఎలక్ట్రానిక్ కార్లలో చైనాకు చెందిన బీవైడీ, యూరప్‌కు చెందిన ఫోక్స్‌వ్యాగన్‌, బీఎండబ్ల్యూ లు కొత్తవి మార్కెట్లోకి దూసుకొస్తున్నాయి. ఇవి టెస్లాకు గట్టి పోటీనిస్తున్నాయి. దీని వలన విదేశాల్లో టెస్లా కార్లను కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. విద్యుత్‌ కార్ల విక్రయాల్లో టెస్లాను బీవైడీ దాటేసినట్లు కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌  చెబుతోంది. 

 

today-latest-news-in-telugu | elon-musk | tesla | sales

Also Read: Cricket: ఈ ఏడాది టీమ్ ఇండియా షెడ్యూల్ విడుదల

Advertisment
Advertisment
Advertisment