PF చందాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై UPI ద్వారా నేరుగా పీఎఫ్ విత్‌డ్రా!

ఈపీఎఫ్‌ఓ చందాదారులు తమ PF ఖాతాలోని నగదును యూపీఐ చెల్లింపు గేట్‌వే ద్వారా సులభంగా తమ బ్యాంకు అకౌంట్‌లోకి బదిలీ చేసుకోవచ్చు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది.

New Update
EPFO withdrawal via UPI soon, PF money may reach bank accounts in minutes

EPFO withdrawal via UPI soon, PF money may reach bank accounts in minutes

 ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన 7 కోట్ల మందికి పైగా చందాదారుల కోసం విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టనుంది. ఇకనుంచి ఈపీఎఫ్‌ఓ చందాదారులు తమ PF ఖాతాలోని నగదును యూపీఐ చెల్లింపు గేట్‌వే ద్వారా సులభంగా తమ బ్యాంకు అకౌంట్‌లోకి బదిలీ చేసుకోవచ్చు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన సాంకేతిక పరీక్షలు సక్సెస్‌ఫుల్‌గా పూర్తయినట్లు తాజాగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. ప్రస్తుతం EPFO సాఫ్ట్‌వేర్‌లో ఉన్న చిన్నపాటి లోపాలను సరిదిద్ది, ఈ సరికొత్త సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కార్మిక మంత్రిత్వ శాఖ వేగంగా కసరత్తులు చేస్తోందని పేర్కొన్నారు.

Also Read: గౌతమ్ అదానీకి భారీ ఊరట.. కేసులు ఉపసంహరించుకున్న అమెరికా.. కారణం ఇదే!

ప్రస్తుతం అమల్లో ఉన్న రూల్స్‌ ప్రకారం చూసుకుంటే చందాదారులు తమ PF నగదును విత్‌డ్రా చేసుకోవాలంటే ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆటో సెటిల్‌మెంట్‌ కింద క్లెయిమ్‌ చేసుకున్నా కూడా రూ.5 లక్షల వరకు విత్‌డ్రా చేసుకునేందుకు కనీసం 3 రోజుల సమయం పడుతోంది. దీంతో అత్యవసర వైద్య ఖర్చులు, ఆస్పత్రుల చేరిక లాంటి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అందుకే ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్రం నేరుగా యూపీఐ ద్వారా డబ్బులు ఉపసంహరించుకునే వెసులుబాటును తీసుకొస్తుంది. చందాదారులు PF అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్‌ను చూసుకుని, బ్యాంకు ఖాతాకు లింక్‌ అయ్యి ఉన్న యూపీఐ పిన్ ద్వారా సురక్షితంగా డబ్బును బదిలీ చేసుకోవచ్చు. అనంతరం ఆ మొత్తాన్ని డిజిటల్ చెల్లింపులకు వాడుకోవచ్చు లేదా ATM ద్వారా కూడా నగదుగా తీసుకోవచ్చు.

Also Read: ఈ-ఫార్మసీలపై పోరు...రేపు దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్..

పీఎఫ్ చందాదారుల కోసం వచ్చే నెల నుంచి వాట్సప్ సేవలను కూడా ప్రారంభించాలని EPFO భావిస్తోంది. PMVBRY (ప్రధాన మంత్రి వికసిత్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన) కింద ప్రాథమిక సేవలను సులభతరం చేసేందుకు ఈ ప్లాట్‌ఫామ్‌ను వాడనున్నారు. చందాదారులు తమ మొబైల్ నంబర్ నుంచి EPFO  వాట్సప్ నంబరుకు కేవలం ‘Hello’ అని సందేశం పంపిస్తే చాలు. స్థానిక భాషల్లోనే సేవలు పొందవచ్చు. దీని ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవడంతో పాటు, చివరి 5 లావాదేవీల వివరాలను వేగంగా తెలుసుకోవచ్చు. రాబోయే నెల రోజుల్లోనే ఈ వాట్సప్ సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు