/rtv/media/media_files/2025/04/07/n56wbnrQrS5NWlgW23tO.jpg)
petrol and diesel rates increases
Petrol: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. పెట్రోలో, డీజిల్ పై మరో రూ.2 పెంచింది. ఏప్రిల్ 7 అర్థరాత్రి నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నట్లు తెలిపింది. పెంచిన ధరలు కంపెనీలే భరిస్తాయని, సామాన్యుడిమీద భారం పడదని స్పష్టం చేసింది.
Central Government raises excise duty by Rs 2 each on petrol and diesel: Department of Revenue notification pic.twitter.com/WjOiv1E9ch
— ANI (@ANI) April 7, 2025
భారం కంపెనీలే భరిస్తాయి..
ఈ మేరకు ప్రస్తుతం హైదరాబాద్ లో 107.46 పైసలు ఉన్న పెట్రోలో పెంచిన ధరతో 107.46 పైసలు కానుంది. ఇక డీజిల్ ప్రస్తుతం 97.70 పైసలుండగా పెరిగిన ధరతో 99.70 పైసలు కానుంది. ఇక తెలంగాణలోని వివిధ జిల్లాల్లో 108, 107 రూపాయలు కొనసాగుతోంది. అయితే ఈ పెరిగిన ధరలతో సామాన్యుడిపై ఎలాంటి భారం పడదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల ఇతర వస్తువులు కూడా పెరిగే అవకాశం ఉందని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు.
Also Read: HCU వివాదంపై రేవంత్ రెడ్డికి హీరోయిన్ కౌంటర్! అవి AI కాదు రియల్
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర15 శాతం తగ్గింది. ప్రస్తుతం 1 బ్యారెల్ ముడి చమురు ధర $63.34గా ఉంది. ఇది అత్యల్ప స్థాయిగా చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితిలో, దేశంలో పెట్రోల్, డీజిల్ సరఫరా చేసే కంపెనీల లాభాలు పెరిగాయి. ఇందులో భాగంగానే ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు పెట్రోల్ ,డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.2 పెంచినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: వారానికి ఎన్ని రోజులు ఆకుకూరలు తింటే మంచిది
rates | india | telugu-news | today telugu news