/rtv/media/media_files/2025/02/10/liqpZ6uiX5f287h4cPxG.jpg)
bsnl cheapest recharge plan announced
ప్రస్తుతం ప్రముఖ టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ తమ రీఛార్జ్ ప్లాన్‌లను భారీగా పెంచేశాయి. ఈ క్రమంలో ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన BSNL తక్కువ ధరలో రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తూ యూజర్లను తనవైపుకు లాక్కుంటోంది. అదే సమయంలో ఆఫర్లు సైతం అందిస్తూ వినియోగదారులను అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పటికే ఎన్నో ప్లాన్‌లను తక్కువ ధరలో అందించింది బీఎస్ఎన్ఎల్.
Also Read : అమెరికా ఇంక తగ్గేదే లే..యూఎస్ కాంగ్రెస్ లో ట్రంప్ మొదటి ప్రసంగం
BSNL Recharge Offer
తాజాగా మరొక అద్భుతమైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. లాంగ్ టెర్మ్ కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు ఇదొక అద్భుతమైన అవకాశం అనే చెప్పాలి. జియో, ఎయిర్‌టెల్, Vi తమ రీఛార్జ్ ధరలను పెంచిన తర్వాత BSNL గత సంవత్సరం నుంచి చాలా చాకచక్యంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే వరుస చీపెస్ట్ ప్లాన్‌లను తీసుకొస్తూ ఆకట్టుకుంటోంది. మరి ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ప్లాన్ వివరాలు తెలుసుకుందాం.
Also Read : ఇంద్రా బస్సు బోల్తా.. స్పాట్‌లో 12 మంది..
BSNL తీసుకొచ్చిన ప్రీపెయిడ్ ప్లాన్ విషయానికొస్తే.. ఇది రూ. 2,398 ధరతో అందుబాటులోకి వచ్చింది. 425 రోజుల వ్యాలిడిటీ(14 నెలల)తో వస్తుంది. ఈ ప్లాన్ తరచుగా రీఛార్జ్‌ల గురించి ఆందోళన చెందుతున్న వినియోగదారులకు బాగా ఉపయోగపడుతుందనే చెప్పాలి.
Also Read : ఇంద్రా బస్సు బోల్తా.. స్పాట్‌లో 12 మంది..
ప్లాన్ అందించేది బెనిఫిట్స్ విషయానికొస్తే.. ఈ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్స్ పొందొచ్చు. భారతదేశం అంతటా అన్ని నెట్‌వర్క్‌లకు ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. అలాగే రోజువారీ డేటా లభిస్తుంది. అంటే రోజుకు 2GB హై-స్పీడ్ డేటా పొందొచ్చు. మొత్తం ఈ వ్యాలిడిటీ అయ్యే వరకు 850GB లభిస్తుంది. రోజువారీ డేటా అయిపోయిన తర్వాత 40Kbps వేగంతో ఇది డేటా అందిస్తుంది. అలాగే రోజుకు 100 ఉచిత SMS లభిస్తాయి.
Also Read : చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో వెల్లుల్లి ఎలా పనిచేస్తుంది?
ఆ రాష్ట్రంలోనే ఈ బెనిఫిట్స్
జియో, ఎయిర్‌టెల్, విఐ ప్లాన్‌ల ధరలతో పోలిస్తే.. బిఎస్‌ఎన్‌ఎల్ తాజా ఆఫర్ వినియోగదారులకు ఎంతగానో ఉపయోగపడుతుందనే చెప్పాలి. ముఖ్యంగా సంవత్సరంలో తక్కువ రీఛార్జ్‌లను ఇష్టపడే వారికి ఇది బెస్ట్‌గా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ రీఛార్జ్ ప్లాన్ జమ్మూ & కాశ్మీర్ ప్రాంతంలో ప్రత్యేకంగా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ను ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తారా లేదా అని బిఎస్‌ఎన్‌ఎల్ ఇంకా ధృవీకరించలేదు.