/rtv/media/media_files/2024/11/25/aNcPR16jMium2w5ew2Pp.jpg)
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచీ బిట్ కాయిన్ ధర అమాంతం పెరిగిపోయింది. అప్పటి నుంచీ దీని ధర పెరుగుతూనే ఉంది. దీంతో రెండున్నర నెల్లో ఒక్క బిట్ కాయిన్ పై రూ.30 లక్షల లాభం వచ్చింది. ఇది యాభై శాతం కంటే ఎక్కువ అని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ గరిష్ట స్థాయిని తాకింది అంటున్నారు.
ట్రంప్ గెలవడమే కారణం...
ట్రంప్ మొదటి నుంచి బిట్ కాయిన్‌కు అనుకూలం. అమెరికాను క్రిప్టో రాజధానిగా చేస్తానని ఎప్పుడో చెప్పారు. అంతేకాదు డిజిటల్ కరెన్సీ జాతీయ నిల్వలను సృష్టించేందుకు పరిశీలిస్తామని ట్రంప్ ప్రకటించారు. దీంతో బిట్ కాయిన్ ధర పరుగులు తీస్తోంది. దానికి తోడు ఆయన టీమ్ లో ఉన్న ఎలాన్ మస్క్ కూడా క్రిప్టో కరెన్సీకి ఫుల్ సపోర్ట్. బిట్ కాయిన్ ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు కూడ మస్క్ కంపెనీ టెస్లా బిట్ కాయిన్‌లో 1.5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. దాంతో పాటూ ఇప్పుడు ట్రంప్ మంత్రి వర్గంలో ఎక్కువగా వ్యాపారవేత్తలు ఉండే అవకాశం ఉంది. ఇందులో చాలా మంది బిలయనీర్లే ఉంటారు. ఇది పారిశ్రామిక రంగానికి సానుకూలంగా మారనుంది. అప్పుడు బిట్ కాయిన్ ధర మరింత పెరుగుతుంది. క్రిప్టో కరెన్సీ ఇంకా ముందుకు వెళుతుంది. ఈ అంచనాలే ప్రస్తుత బి కాయిన్ పెరుగుదలకు కారణమని విశ్లేషణలు వస్తున్నాయి.
బిట్ కాయిన్ పెరుగుదల..
అమెరికా అధ్యక్ష ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి క్రిప్టో కరెన్సీ వాల్యూ పెరుగుతోంది నవంబర్ 5 ఫలితాలు వెలువడ్డ రోజు బిట్ కాయిన్ ధర 77,811 డాలర్ల దగ్గర ట్రేడయింది. తర్వాత ట్రంప్ గెలుస్తున్నారన్న వార్తతో ఒక రోజులే దాదాపు 3 వేలు పెరిగింది. అది అక్కడ నుంచి ఎప్పుడూ వెనక్కు తగ్గలేదు. సమయానికి తగ్గట్టు పెరుగుతూ పోయింది. ప్రస్తుతం ఈరోజుకు ఒక బిట్ కాయిన్ విలువ 102,321 డాలర్ల వద్ద ఉంది. అంటే ఈ రెండున్నర నెలల్లోనే బిట్ కాయిన్ విలువ దాదాపు 35 వేల డాలర్లు పెరిగింది. దీనినే ఇండియన్ కరెన్సీలో చెప్పుకుంటే...నవంబర్ 5న 60 లక్షలు పెట్టి ఒక బిట్ కాయిన్ కొంటే...ఇప్పుడు దాని విలువ దాదాపు 90 లక్షలు అయింది. అంటే రెండున్నర నెలల్లో 30 లక్షలు లాభం వచ్చినట్టయింది.
Also Read: USA: ట్రంప్ మొదట సంతకాలు చేసిన పది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఇవే..