Stock Market: నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు
రెండు రోజుల లాభాల తర్వాత దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఊగిసలాడుతున్నాయి. సెన్సెక్స్ 200 పాయింట్లు తగ్గి 82,500 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 50 పాయింట్లు తగ్గి 25,170 వద్ద ఉంది.
రెండు రోజుల లాభాల తర్వాత దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఊగిసలాడుతున్నాయి. సెన్సెక్స్ 200 పాయింట్లు తగ్గి 82,500 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 50 పాయింట్లు తగ్గి 25,170 వద్ద ఉంది.
ఉద్యోగులకు EPFO సేవలు మరింత సులభతరం కానున్నాయి. EPF బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, పాక్‌బుక్ డౌన్లోడ్ చేయడం లాంటి సేవలు ఈజీగా పొందవచ్చు. డిజిలాకర్ అనే యాప్‌లో ఈపీఎఫ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు.
కర్ణాటకలో చిరు వ్యాపారులు వినూత్న నిరసనను చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా బేకరీల్లో టీ, కాఫీ, పాల విక్రయాలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. జీఎస్టీ అధికారులు తమను టార్గెట్ చేసుకొని నోటీసులు పంపిస్తున్నారంటూ వారు ఈ ఆందోళన చేపడుతున్నారు.
కోల్డ్‌ప్లే కచేరీ "కిస్ కామ్" ఘటన నేపథ్యంలో, ఆస్ట్రోనమర్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓ ఆండీ బైరన్ తన పదవికి రాజీనామా చేశారు. కంపెనీ హెచ్ఆర్ చీఫ్ క్రిస్టిన్ క్యాబోట్‌తో కలిసి ఆయన కచేరీలో కిస్ కామ్ కెమెరాకు చిక్కడం, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన కేసుల విచారణ ED వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే టెక్ దిగ్గజాలైన గూగుల్, మెటాకు దర్యాప్తు సంస్థ శనివారం నోటీసులు జారీ చేసింది. జులై 21న ఈ కంపెనీ ప్రతినిధులు విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది.
నాగ్‌పూర్‌కి చెందిన డాలీ చాయ్ వాలా 'డాలీ కీ తప్రి' పేరుతో దేశవ్యాప్తంగా ఫ్రాంచైజీలను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ యాడ్ ఇచ్చిన తర్వాత రెండు రోజుల్లో దాదాపుగా 1,600కు పైగా దరఖాస్తులు వచ్చాయి. డాలీ చాయ్‌కి భారీగా డిమాండ్ ఏర్పడింది.
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేసేటప్పుడు తప్పుడు డిక్లరేషన్లపై క్లెయిమ్ చేస్తే పన్నులో 200% వరకు జరిమానా విధిస్తారు. అలాగే సంవత్సరానికి 24% వరకు వడ్డీ చెల్లించడంతో పాటు 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది.
అమెరికాలో టెస్లా కారు ధర రూ.38.63 లక్షలు ఉండగా, ఇండియాలో రూ.61.07 లక్షలకి విక్రయించనున్నారు. అయితే అమెరికాతో పోలిస్తే భారత్‌లో ధరలు ఎక్కువగా ఉండటానికి ముఖ్య కారణం అధిక దిగుమతి సుంకాలు. టెస్లా కార్లు దేశంలో తయారు అయితే వీటి ధరలు తగ్గే అవకాశం ఉంది.
మహారాష్ట్ర ముంబైలోని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కు మంగళవారం బాంబు బెదిరింపు వచ్చింది. ఈ-మెయిల్ ద్వారా అక్కడ భారీ పేలుడు సంభవిస్తోందని బెదిరింపు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ-మెయిల్ ఐడీ కేరళ సీఎం కామ్రేడ్ పినరయి విజయన్ పేరుతో ఉందట.