Tamil Nadu: ఒకప్పుడు సీఎం...ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ..పన్నీర్ సెల్వం పరిస్థితి ముఖ్యమంత్రిగా ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను శాసించిన పన్నీర్ సెల్వం నేడు స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. తన ఉనికి కోసం తానే పోరాడుతున్న ఈ మాజీ సీఎంకు మద్దతు ప్రకటించింది బీజేపీ. రామనాథపురం నుంచి ఈయన స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్నారు. By Manogna alamuru 26 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Panneer Selvam: ఒకప్పుడు ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి. జయలలిత ఉన్నప్పుడు అన్నాడీఎంకే పార్టీలో అతి ముఖ్యమైన వ్యక్తి పన్నీర్ సెల్వం. కానీ ఆమె చనిపోయిన తరువాత మొత్తం పరిస్థితి మారిపోయింది. పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో ఈసారి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు సన్నీర్ సెల్వం. రామనాథపురం లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఒకప్పుడు ముఖ్యమంత్రిగా, అన్నీ డీఎంకే పార్టీలో ముఖ్యనేతగా ఉన్న పన్నీర్ సెల్వం ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా గట్టి పోటీని ఎదుర్కోబోతున్నారు. ఒక్కస్థానం నుంచి గెలవడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తోంది. మరోవైపు అన్నాడీఎంకే పార్టీ జెండా, లెటర్‌హెడ్‌ను నిలబెట్టుకునేందుకు హైకోర్టును ఆశ్రయించగా, ఆ కేసును కోర్టు జూన్ 10కి వాయిదా వేసింది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఈయనకు జాతీయ పార్టీ బీజేపీ మద్దతు పలకడంతో అందరిదృష్టీ పన్నీర్ సెల్వం మీద పడింది. దక్షిణలో పట్టు కోసం.. ఈసారి ఎన్నికల్లో సౌత్‌లో ఎలా అయినా పట్టు సాధించాలని చూస్తోంది జాతీయ పార్టీ బీజేపీ. ముఖ్యంగా తమిళనాడు మీద దృష్టిని కేంద్రీకరించింది. దీని కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పన్నీర్ సెల్వానికి మద్దతును ప్రకటించింది. రామనాథపరుం నుంచి తమ అభ్యర్థిని నిలపమని చెప్పింది. పార్టీ నుంచి బహిష్కృతం అవ్వక ముందు పన్నీర్ సెల్వం పెద్ద నేత. అన్నీడీఎంకే పార్టీలో జయలలితకు నమ్మిన బంటు. అందుకే ఆమె తాను జైలుకు వెళ్ళినప్పుడు పన్నీర్‌నే ముఖ్యమంత్రిగా చేసింది. తరువాత పార్టీ పగ్గాలు శశికళ చేజిక్కుంచుకోవడంతో పన్నీర్ సెల్వాన్ని పార్టీ నుంచి బహిష్కరించింది. అయితే తమిళనాడులో పన్నీర్‌కు ఇంకా సపోర్ట్ ఉంది. అందుకే ఆయన స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. అయితే ఇలాంటి వారికి మద్దతు ప్రకటిస్తే తమిళనాడులో తమ ఆధిక్యాన్ని నిరూపించుకోవచ్చని అనుకుంటోంది బీజేపీ. రెండు పార్టీలు వేర్వేరుగా... గత ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేశాయి. కానీ ఈసారి రెండూ వేర్వేరుగా బరిలోకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్నీడీఎంకే చీలిక వర్గంతో తాను తప్పక గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు పన్నీర్ సెల్వం. ఇదే నమ్మకంతో బీజేపీ కూడా ఈయనకు మద్దతు తెలుపుతున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి మీద అన్నీడీఎంకే అభ్యర్థి లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయింది. అప్పుడు బీజేపీ మద్దతు ఉన్నా లాభం లేకపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేయడంలేదు. దాంతో పాటూ పార్టీలో కూడా చీలిక ఏర్పడింది. ఇది పన్నీర్‌కు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. బీజేపీ సపోర్ట్, అన్నాడీఎంకే చీలిక వర్గం ఇద్దరి మద్దతుతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు పన్నీర్ సెల్వం. గత ఎన్నికల్లో తేడా వచ్చిన లక్ష మెజారిటీని ఈజీగా కవర్ చేయొచ్చని అంటున్నారు. Also Read:Kavitha : కడిగిన ముత్యంలా బయటకు వస్తా.. ఎమ్మెల్సీ కవిత #bjp #elections #tamilnadu #panneer-selvam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి