Telangana: బీటాక్స్ మంత్రి..భట్టి మీద ఏలేటి మహేశ్వర రెడ్డి ఆరోపణలు

బీజేపీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మీద విరుచుకుపడ్డారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీద ఆరోపణలు చేశారు. అలాగే ఆయనేమైనా ప్రధానమంత్రా అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీదన కూడా మండిపడ్డారు.

New Update
Telangana: బీటాక్స్ మంత్రి..భట్టి మీద ఏలేటి మహేశ్వర రెడ్డి ఆరోపణలు

Eleti maheswar Reddy: కాంగ్రెస్‌లో ఒక మంత్రి కొత్తగా బీ టాక్స్ మొదలెట్టారు..బీ టాక్స్ అంటే బట్టి టాక్స్ అని నాకు తెలియదు .. కొత్తగా వచ్చింది అంట అంటూ డీప్యూటీ సీం భట్టి మీద తీవ్ర ఆరోపణలు చేశారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి. బీ టాక్స్ ను 8 నుంచి 9 శాతం కాంట్రాక్టర్ల వద్ద వసూల్ చేస్తున్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలియకుండానే భట్టి ఇదంతా చేస్తున్నారా అంటూ ఏలేటి ప్రశ్నించారు. లేదా సీఎంకు కూడా ఇందులో వాటా ఉందా అని అనుమానం వ్యక్తం చేశారు.

ధరణి కుంభకోణం గురించి ఎందుకు మాట్లాడటం లేదు..

మరోవైపు ధరణి లో రెండు లక్షల అవినీతి జరిగింది. లక్షల ఎకరాల భూ కుంభకోణం జరిగింది. అప్పుడు కేసిఆర్ రెవెన్యూ మంత్రిగా ఉన్నారు కదా...మరి సీఎం రేవంత్ రెడ్డి వారి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు ఏలేటి మహేశ్వర్రెడ్డి. ఈ కుంభకోణం బయటికి ఎందుకు తీయట్లేదని అడిగారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 24 లక్షల ఎకరాల అసైన్ భూమి ఉండేది. ప్రస్తుతం మిగిలింది 6 లక్షల ఎకరాలు మాత్రమే. దాంతో పాటూ లక్ష ఎకరాల ఎండోమెంట్ భూమి ఉంటే....అందులో 40శాతం మాయమైంది. దీని గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలే తీసుకోవడం లేదో అర్ధం కావడం లేదంటూ విరుచుకుపడ్డారు. గతంలో రేవంత్ ధరణి బాధ్యుల మీద చర్యలు తీసుకుంటాను అన్నారు కదా.. ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు గడుస్తున్నా మరి చర్యలు ఎందుకు లేవు ?అన్యాక్రాంతం అయిన భూముల విషయం పక్కన పెట్టి ఏదో విషయాన్ని తెర మీదకి తెస్తున్నారు. కొకాపేట్ భూముల ఆక్షన్ మీద మట్లాడటలేదు? మియాపూర్ భూ కుంభకోణం లో కేకే హస్తం ఉందని రేవంత్ అన్నారు. మేయర్ బొంతు రామ్మోహన్ మీద అనేక భూ ఆరోపణలు ఉన్నాయని ఆయనే చెప్పారు. రంజిత్ రెడ్డి మక్క స్కాం, లాండ్ స్కామ్ లో ఉన్నారని కూడా అన్నారు. మరి ఇప్పుడు వాళ్ళందరినీ పార్టీలో ఎలా చేర్చుకున్నారు. లేదా పార్టీలో చేరాక వాళ్ళందరూ ఆణిముత్యాలు అయిపోయారా అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ వీటన్నింటికీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కోమటిరెడ్డి ప్రధానమంత్రా...

పనిలో పనిగా కోమటి రెడ్డి వెంకటరెడ్డి మీద కూడా విమర్శలు చేశారు ఏలేటి. కోమటిరెడ్డిని బ్రతిమాలేందుకు ఆయన ఏమైనా ప్రధాన మంత్రినా..మహేశ్వర రెడ్డి కి ఒక చరిత్ర ఉంది. రాజకీయాలు మొదలు పెట్టిన నుంచి ఒకే ఒక్కసారి పార్టీ మారాను. పాత - కొత్త కాంగ్రెస్ నేతల ఫైటింగ్ , సైకిల్ కాంగ్రెస్ తో ఉండలేక బీజేపీ లో చేరాను.
50 వేల మెజారిటీ తో నన్ను గెలిపించారు. ఇప్పుడు పార్టీ మారే ప్రసక్తే లేదు అంటూ చెప్పుకొచ్చారు ఏలేటి.

Also Read:Telangana: కెసిఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నా రావు అరెస్ట్

Advertisment
Advertisment
తాజా కథనాలు