Yogi Adityanath : యూపీలో బీజేపీ ఘోర పరాజయం.. యోగీని మారుస్తారా ?

లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఘోరంగా ఓటమిపాలయ్యింది. 2019 ఎన్నికల్లో 64 ఎంపీ సీట్లు రాగా ఈసారి 33 స్థానాలకు పడిపోయింది. మోదీ -యోగీ వేవ్‌ అక్కడ కనిపించలేదు. దీంతో యోగీ ఆదిత్యనాథ్‌ను యూపీ సీఎంగా కొనసాగిస్తారా లేదా అనేది చర్చనీయం అవుతోంది.

New Update
Yogi Adityanath : యూపీలో బీజేపీ ఘోర పరాజయం.. యోగీని మారుస్తారా ?

Lok Sabha Elections : కేంద్రంలో అధికారంలోకి రావాలంటే లోక్‌సభ ఎన్నికల్లో 272 సీట్ల మెజార్టీ రావాలి. అయితే దేశంలో అత్యధిక ఎంపీ సీట్లున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh). ఇక్కడ మొత్తం 80 స్థానాలున్నాయి. కేంద్రంలో అధికారాన్ని కట్టబెట్టేందుకు యూపీ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. 2014 నుంచి భారీ అధిక్యంతో దూసుకుపోతున్న బీజేపీ (BJP) కి 2024 ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బే తగిలింది. మోదీ (PM Modi), యోగీ వేవ్‌ ఇక్కడ కనిపించలేదు. ఎన్డీయే కంటే ఇండియా కూటమికే ఇక్కడ ఎక్కువ స్థానాలు వచ్చాయియ 2014లో బీజేపీ ఏకంగా 73 స్థానాల్లో గెలిచింది. 2019లో సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ కలిసిపోటీ చేయడంతో బీజేపీకి 64 స్థానాలే వచ్చాయి. ఈసారి జరిగిన ఎన్నికల్లో మాత్రం కేవంల 33 స్థానాలతోనే సరిపెట్టుకుంది. అంటే దాదాపు సగం సీట్లు తగ్గిపోయాయి.

దెబ్బకొట్టిన ముస్లిం, బీసీ ఓట్లు 

2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 130 స్థానాలు కోల్పోగా.. ఇది లోక్‌సభ ఎన్నికల ఎన్నికలపై కూడా ప్రభావం చూపిస్తుందని ముందుగానే అంచనా వేశారు. అక్కడ ముస్లిం, బీసీలు ముఖ్యంగా యాదవ్‌ల ఓట్లు ఇండియా కూటమివైపుకు వెళ్లాయి. ముస్లిం-యాదవ వర్గాలను ఆకట్టుకునే లక్ష్యంతో ప్రచారం చేయడం కూడా ఇండియా కూటమికి సీట్లు పెరగడం కారణమైంది. బీఎస్పీ పడాల్సిన ఓట్లు పెద్ద ఎత్తున ఇండియా కూటమికి షిఫ్ట్‌ అయినట్లు తెలుస్తోంది. యూపీ సీట్లు కేటాయింపులో కూడా సామాజిక సమీకరణలను సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లు పాటించాయి. దీంతో బీజేపీకి గట్టి ఎదురుబెబ్బ తగిలింది. అలాగే బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని, రిజర్వేషన్లు పోతాయని ఇండియా కూటమి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాయి. ఈ అంశం కూడా బీజేపీకి ప్రతికూల ప్రభావం చూపించింది.

Also read: రైతులకు.. పేదలకు మోదీ గుడ్ న్యూస్.. తొలి సంతకం ఆ ఫైల్ పైనే!

తగ్గిపోయిన మోదీ-యోగీ ప్రభావం

ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా కొనసాగతున్న యోగీ ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) ఈ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు సాధించడంలో విఫలమైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. యూపీలో మోదీ-యోగీ అనే బంధానికి పాపులారిటీ ఉంది. వీళ్లిద్దరి ముఖాలను చూసి ఓట్లు వేసేవాళ్లు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈసారి జరిగిన ఎన్నికల్లో మాత్రం వీరి ప్రభావం చాలావరకు తగ్గిపోయింది. ఇది 2027లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఇది కొనసాగే అవకాశం ఉంటుందని దీనివల్ల బీజేపీ అక్కడ అధికారాన్ని కోల్పోయే పరిస్థితి కూడా రావొచ్చని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ను ముఖ్యమంత్రిగా కొనసాగించాలా లేదా ఓటర్లలో మద్దతు కూడగట్టుకునేందుకు వేరే వాళ్లకి సీఎంగా అవకాశం ఇవ్వాలా అనే అంశం తెరపైకి వచ్చింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ ఘోరంగా విఫలమవ్వడం, ముఖ్యంగా అయోధ్య రామాలయం ఉన్న ఫైజాబాద్‌ నియోజకవర్గంలో కూడా బీజేపీ ఓడిపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. అలాగే వారణాసిలో పోటి చేసిన ప్రదాని మోదీ.. 2019లో దాదాపు 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిస్తే.. ఈసారి మాత్రం కేవలం లక్షా 50 వేల ఓట్ల మెజార్టీతో మాత్రమే గెలిచారంటే ఆ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

Also read: ఎంపీలతో ప్రమాణం చేయించే ప్రొటెం స్పీకర్ ను ఎలా ఎంపిక చేస్తారో తెలుసా?

ఢిల్లీలోనే యోగీ

మరో విషయం ఏంటంటే ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని మోదీ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో 71 మంది ఎంపీలు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి వివిధ రంగాల ప్రముఖులు, విదేశీ అధినేతలు హాజరయ్యారు. అలాగే బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. అయితే నిన్న ప్రమాణస్వీకారం కార్యక్రమం ముగిసిన అనంతరం బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు తిరిగి తమ రాష్ట్రాలకు వెళ్లిపోయారు. కానీ ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ను మాత్రం ఆపేసింది బీజేపీ అదిష్ఠానం. ప్రస్తుతం యోగీతో ఎన్నికల ఓటమిపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే యూపీలో మళ్లీ బీజేపీ బలాన్ని పెంచేందుకు ఆ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు