Uttar Pradesh : దారుణం.. టీచర్‌ను తుపాకితో కాల్చి చంపిన విద్యార్థి

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో దారుణం జరిగింది. కంప్యూటర్‌ సెంటర్‌లో క్లాసులు చెబుతున్న టీచర్‌ను ఓ విద్యార్థి ప్రేమించాడు. చాలాసార్లు ప్రపోజ్ చేశాడు. కానీ ఆ టీచర్ తిరస్కరించడంతో.. చివరికి ఆమెను తుపాకితో కాల్చాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ టీచర్ మృతి చెందారు.

New Update
America : అమెరికాలో మరోసారి పేలిన తూటా.. ఐదుగురిని కాల్చి చంపిన దుండగుడు!

Student Fire : ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) లోని బిజ్నోర్‌లో ఓ విద్యార్థి దారుణానికి పాల్పడ్డాడు. ఏకంగా టీచర్‌(Teacher) నే తుపాకీతో కాల్చాడు(Gun Fire). ఆస్పత్రిలో 33 గంటల పాటు పోరాడిన ఆ ఉపాధ్యాయురాలు మరణించింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. బిజ్నోర్‌లోని కోమల్ (25) అనే టీచర్‌ కంప్యూటర్ సెంటర్‌లో బోధిస్తుండేవారు. రోజులాగే ఆమె క్లాస్‌కు వెళ్లింది. ప్రశాంత్ అనే పూర్వ విద్యార్థి ఆ తరగతికి వచ్చారు. క్లాస్‌ జరుగుతుండగానే టీచర్‌పై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారారయ్యాడు. ఆ టీచర్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిచారు. కానీ బుల్లెట్‌ను బయటకు తీయలేకపోయారు. దాదాపు 32 గంటల పాటు ఆమె చావుబతుకుల మధ్య పోరాడింది. చివరికి ప్రాణాలు కోల్పోయింది.

Also Read: నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు అరెస్టు.. పాక్‌ ఐఎస్‌ఐతో సంబంధాలు

మరోవైపు నిందితుడయిన విద్యా్ర్థి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ప్రశాంత్ తండ్రి లవకుష్‌ను కూడా విచారిస్తున్నారు. అయితే ప్రశాంత్ 2022లో కంప్యూటర్ సెంటర్‌(Computer Centre) లో కోర్సు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. అతడు ఆ సమయంలో కోమల్‌ను ప్రేమించాడు. ఆమెకు చాలాసార్లు ప్రపోజ్ చేశాడు. కానీ కోమల్ ఇందుకు ఒప్పుకోలేదు. దీంతో ప్రశాంత్ అప్పటినుంచి ఆమెపై ద్వేషం పెంచుకున్నాడు. ప్రతికారంతో చివరికి ఆమెను తుపాకితో కాల్చి చంపాడు. టీచర్‌పై విద్యార్థి కాల్పులు జరిపడం స్థానికంగా కలకలం రేపుతోంది.

Also Read: సిక్కుల పవిత్ర గ్రంథం పేజీలు చింపినందుకు యువకుడు దారుణ హత్య

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Uttar Pradesh : ఐదుగురు పిల్లల తల్లి, నలుగురు పిల్లల తండ్రితో జంప్!

ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఐదుగురు పిల్లల తల్లి అదే గ్రామంలో నివసించే నలుగురు పిల్లల తండ్రితో లేచిపోయింది. ఇది మాత్రమే కాదు, ఆమె తన ప్రియుడిని వివాహం చేసుకున్న ఫోటోను కూడా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.

New Update
marriage 2nd

marriage 2nd

ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఐదుగురు పిల్లల తల్లి అదే గ్రామంలో నివసించే నలుగురు పిల్లల తండ్రితో లేచిపోయింది. ఇది మాత్రమే కాదు, ఆమె తన ప్రియుడిని వివాహం చేసుకున్న ఫోటోను కూడా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఇద్దరి కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిసింది. 

ఈ సంఘటన ఏప్రిల్ 5వ తేదీన జరిగింది. సిద్ధార్థ్ నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని మహారియా గ్రామానికి చెందిన గీత అనే మహిళ తన ఐదుగురు పిల్లలను, భర్తను వదిలి ఇంట్లోని నగదు, నగలను తీసుకుని అదృశ్యమైంది. తన భార్య తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి ఉండవచ్చని ఆమె భర్త  శ్రీ చంద్ అనుకున్నాడు. కానీ మూడు రోజుల తర్వాత గ్రామానికి చెందిన గోపాల్ అనే యువకుడితో అతని భార్య పెళ్లి ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.  ఇది చూసి ఆ మహిళ భర్త శ్రీ చంద్ షాక్ అయ్యాడు. 

పెద్ద కూతురికి 19 సంవత్సరాలు

శ్రీ చంద్ కు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు సహా 5 మంది పిల్లలు ఉన్నారు. పెద్ద కూతురికి దాదాపు 19 సంవత్సరాలు, చిన్న కూతురికి 5 సంవత్సరాలు. శ్రీ చంద్ గతంలో ముంబైలోని ఒక వడా పావ్ దుకాణంలో పనిచేసేవాడు. గత కొన్ని రోజులుగా, అతను గ్రామంలో కూలీగా పనిచేస్తూ తన పిల్లలను పోషించుకుంటున్నాడు. తన భార్య ఇంట్లో నుంచి తీసుకెళ్లిన నగలు, రూ.90 వేలు తిరిగి ఇవ్వాలని, ఇకపై ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని  శ్రీ చంద్ చెప్పాడు.

మరోవైపు, శ్రీ చంద్ భార్యతో పారిపోయిన ప్రేమికుడు గోపాల్ పట్వాకు నలుగురు పిల్లలు ఉన్నారు. గోపాల్ ముంబైలో రాఖీ తయారీదారుగా కూడా పనిచేసేవాడని అతని భార్య చెప్పింది. అతను చాలా కాలంగా కుటుంబానికి ఖర్చులు ఇవ్వడం లేదని తెలిపింది.  తాను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో స్వీపర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నానని తెలిపింది.  ఇప్పటి వరకు తాను అన్నీ భరించాను కానీ ఇప్పుడు తన భర్త  రెండో  వివాహం చేసుకున్నాడు కాబట్టి, ఆస్తిలో తన పిల్లలకు వాటా ఇవ్వాలని కోరుతానంది.  ఈ విషయం గురించి తాను పోలీస్ స్టేషన్ కు వెళ్లానని, కానీ ఎవరూ తన మాట వినలేదని గోపాల్ భార్య చెబుతోంది. 

Also read :  Crime: ఛీ.. ఛీ వీడు మనిషేనా! పదేళ్ల బాలికను రేప్ చేసి.. ఆ తర్వాత

 

 

 

Advertisment
Advertisment
Advertisment