IPL 2024 Final: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు షాక్.. IPL ఫైనల్‌కు వర్షం ముప్పు

ఈరోజు SRH, KKR జట్లు రాత్రి 7.30 గంటలకు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో తలపడనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు రాత్రి చెన్నైలో జల్లులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

New Update
IPL 2024 Final: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు షాక్.. IPL ఫైనల్‌కు వర్షం ముప్పు

Rain Threatens KKR vs SRH IPL 2024 Final: ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), కోల్‌కతా నైట్‌ రైడర్స్ (KKR) జట్ల మధ్య ఐపీఎల్‌-17 ఫైనల్ మ్యాచ్‌ జరగనున్న సంగతి తెలిసిందే. రాత్రి 7.30 గంటలకు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మ్యాచ్‌ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు రాత్రి చెన్నైలో జల్లులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Also read: విడాకులకు సిద్ధమైన హార్డిక్ పాండ్యా-నటాషా.. ఆ ఫొటోలన్నీ డిలిట్!

అయితే మ్యాచ్‌ పూర్తిగా నిర్వహించకపోయే ప్రమాదం లేదు. ఒకవేళ ఈరోజు వర్షంతో మ్యాచ్ రద్దయితే.. రేపు రిజర్వ్ డే ఉంటుంది. నిన్న సాయంత్రం కూడా చెపాక్‌ సమీపంలో వర్షం పడటంతో.. SRH, KKR జట్లు తమ ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేసుకున్నాయి. మరి ఈ రాత్రి ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

Also Read: టీ20 వరల్డ్ కప్‌లో భారత్,పాక్ సెమీ ఫైనల్‌ లో ఎదురైయ్యే అవకాశం లేదు..మాజీ ఇంగ్లాండ్ ఆటగాడు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

PBK VS RR: పంజాబ్ కింగ్స్ ను బోల్తా కొట్టించిన రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ 2025లో ఈరోజు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఆర్ఆర్ ఇచ్చిన టార్గెట్ ను ఛేజ్ చేయలేక పంజాబ్ బోల్తా పడింది. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

PBK VS RR

పంజాబ్ కింగ్స్ కు షాక్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. సంజూ శాంసన్ కెప్టెన్సీలో విజయాన్ని నమోదు చేసుకుంది. పంజాబ్ కు 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. ఈ టార్గెట్ ను ఛేదించలేక కింగ్స్ బొక్క బోర్లా పడ్డారు. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయి 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ బ్యాటర్ నేహాల్ వధేరా 62 పరుగులతో హాఫ్ సెంచరీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇతని తర్వాత మాక్స్ వెల్ ఒక్కడే 30 పరుగులు చేసాడు. నేహాల్ , మ్యాక్స్ వెల్ చాలా సేపు క్రీజులో ఉండి జట్టు విజయానికి పాటు పడ్డారు. కానీ మిగతా బ్యాటర్లు ఎవరూ కనీసం డబుల్ డిజిట్ కూడా కొట్టకపోవడంతో మ్యాచ్ ను చేజార్చుకోవాల్సి వచ్చింది.  కింగ్స్ బ్యాటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచే వికెట్లను పోగొట్టుకుంటూ వచ్చింది. 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అంతకు ముందు మ్యాచ్ లో బాగా ఆడిన ప్రభ్ మన్ సింగ్ ఎవరూ కూడా ఎక్కువసేపు ఉండలేదు. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ 3, సందీప్‌ శర్మ 2, మహీశ్ తీక్షణ 2, కార్తికేయ,  హసరంగ చెరో వికెట్‌ తీశారు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్..

చంఢీఘడ్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. జైస్వాల్ 67తో స్కోర్‌తో అదరగొట్టాడు. చివర్లో రియాన్ పరాగ్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 43 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ సంజు శాంసన్ కూడా 38 పరుగులతో రాణించాడు. నితీశ్ రాణా 12, హెట్ మయర్ 20, ధ్రువ్ జురెల్ 13 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.  ఫెర్గూసన్ 2, మార్కో జన్‌సెన్, అర్ష్‌దీప్‌ తలొ వికెట్ తీశాడు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | match | cricket

Also Read: RC 16: రామ్ చరణ్ రోరింగ్ టుమారో..పెద్ది గ్లింప్స్ రిలీజ్

 

Advertisment
Advertisment
Advertisment