కాంగ్రెస్‌ పార్టీకి బిగ్ షాక్‌ .. పార్టీ మారిన ఎమ్మెల్యే అనుచరులు

ములుగు ఎమ్మెల్యే సీతక్కకు బిగ్‌ షాక్‌ తగిలింది. సీతక్క ముఖ్య అనుచరులు బీఆర్‌ఎస్‌లో చేరారు. వారిని జడ్పీ చైర్‌ పర్సన్‌ నాగజ్యోతి కండువా పార్టీలోని ఆహ్వానించారు.

New Update
కాంగ్రెస్‌ పార్టీకి బిగ్ షాక్‌ .. పార్టీ మారిన ఎమ్మెల్యే అనుచరులు

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్‌ పార్టీకి బిగ్ షాక్‌ తగిలింది. ములుగు ఎమ్మెల్యే సితక్క అనుచరులు బీఆర్‌ఎస్‌లో చేరారు. వారిని బీఆర్ఎస్ అభ్యర్థి, జడ్పీ చైర్‌ పర్సన్‌ నాగజ్యోతి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో కన్నాయిగూడెం మండల సోషల్ మీడియా ఇంచార్జ్, యూత్ అధ్యక్షుడు నరేండ్ల అశోక్‌తో పాటు అబ్బాపూర్‌ మండలంలోని పలు గ్రామాలకు చెందిన కార్యకర్తలు ఉన్నారు. సీఎం కేసీఆర్‌ ములుగులో చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్‌ అభ్యర్థి.. సీఎం కేసీఆర్‌తోనే ములుగు నియోజకవర్గం అభివృద్ధి చెందుతోందని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన సంక్షమ పథకాలే అభివృద్ధికి నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్‌తో పాటు కళ్లాల వద్దకే వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో రైతులకు మేలు చేసిన వారిగా నిలిచారన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి దేశంలోనే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో కేసీఆర్ తెలంగాణను నెంబర్‌ వన్‌గా నిలిపారని వెల్లడించారు.

మరోవైపు ఎమ్మెల్యే సీతక్క ముఖ్య అనుచరులు ఆమెకు షాక్‌ ఇవ్వడంతో ములుగులో కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. ఇంతకాలం ములుగులో బలంగా ఉన్న కాంగ్రెస్‌,. ఇప్పుడు సీతక్క అనుచరులు పార్టీ మారడంతో బలహీన పడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి సీతక్క విజయం కోసం కాంగ్రెస్‌ పార్టీ ఎంతమేర శ్రమిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు