Telangana : భారీ దొంగతనం.. పెద్ద ఎత్తున బంగారం, నగదు చోరి గద్వాల పట్టణంలో జరిగిన ఓ భారీ దొంగతనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యాపారి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు 30 తులాల బంగారం, 15 తులాల వెండి వస్తువులు అలాగే రూ.3,50,000 నగదు ఎత్తుకెళ్లారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. By B Aravind 21 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Gold Robbery : జోగులాంబ గద్వాల జిల్లా (Jogulamba Gadwal District) గద్వాల పట్టణంలో జరిగిన ఓ భారీ దొంగతనం (Robbery) ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యాపారి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు.. పెద్దఎత్తున బంగారం (Gold), నగలు దోచుకెళ్లారు. ఇక వివారాల్లోకి వెళ్తే.. వేదనగర్ కాలనీలో రెడిమేట్ వ్యాపారి మిటుకుల ప్రతాప్ నివాసం ఉంటున్నాడు. అయితే ప్రతాబ్ కుటుంబ సభ్యులు గురువారం ఉదయం కర్నూల్‌కు వెళ్లారు. ప్రతాప్ ఇంటి తలుపులు తెరచి ఉండటంతో స్థానికులు అతనికి ఫోన్ చేసి విషయం చెప్పారు. Also Read: ఢిల్లీలో వడగాడ్పులకు 192 మంది మృతి ప్రతాప్ ఇంటికి వచ్చి చూడగా.. మూడు బీరువాలు తెరిచిఉన్నాయి. మొత్తం 30 తులాల బంగారం, 15 తులాల వెండి వస్తువులు అలాగే రూ.3,50,000 నగదు ఎత్తుకెళ్లారని ప్రతాప్ చెప్పారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి దొంగతనం జరిగిన ఇంటిని పరిశీలించి బాధితులతో మాట్లాడారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. Also Read: కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే #telugu-news #telangana-news #thief #gold-robbery మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి