Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. కేసు కొట్టివేసిన కోర్టు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఉపశమనం లభించింది. 2017లో గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. శనివారం ఈ కేసుపై గోవాలోని మపుసా కోర్టులో విచారణ జరగగా.. కేజ్రీవాల్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.

New Update
CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు బెయిలా? జైలా?

Mapusa Court : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌(Aravind Kejriwal) కు భారీ ఊరట లభించింది. ఆయనపై గత ఏడేళ్లుగా కొనసాగుతున్న ఓ కేసును తాజాగా గోవా(Goa) లోని మపుసా కోర్టు  కొట్టివేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. 2017లో గోవాలో అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ ఆమ్‌ ఆద్మీ పార్టీ(AAP) తరఫును ప్రచారాలు నిర్వహించారు. అయితో ఓ భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ.. అన్ని పార్టీల దగ్గర డబ్బులు తీసుకోండి. ఓటు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి వేయండి అంటూ వ్యాఖ్యానించారు.

Also Read: BRS మళ్లీ TRSగా.. కేసీఆర్‌ సంచలన నిర్ణయం !

దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి కేజ్రీవాల్ వ్యాఖ్యానించారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఆయనపై గోవా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ వ్యాఖ్యాలకు లంచానికి సంబంధించిన కేసు అరవింద్‌ కేజ్రీవాల్‌పై నమోదైంది. అంతేకాదు ఈ కేసుకు సంబంధించి గత ఏడాది నవంబర్‌లో ఆయనకు సమన్లు కూడా జారీ చేశారు. 2017 నుంచి ఇప్పటివరకు అంటే దాదాపు ఏడేళ్ల పాటు ఈ కేసు కొనసాగుతోంది.

అయితే ఈ కేసుపై శనివారం.. గోవాలోని మపుసా కోర్టులో విచారణ జరిగింది. కేజ్రీవాల్‌పై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను న్యాయస్థానం కొట్టివేసేంది. చివరికి కేజ్రీవాల్‌కి ఈ కేసులో ఉపశవనం లభించింది. ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఈ ఏడాది మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన తీహార్‌ జైల్లో ఉన్నారు. ఏప్రిల్ 15 వరకు ఆయన జ్యూడీషియల్‌ కస్టడీలో ఉండనున్నారు. ఆ తర్వాత ఈ కేసుపై జరిగే విచారణలో కేజ్రీవాల్‌పై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: పీవోకే, ప్రధాని మోదీపై జోస్యం చెప్పిన ప్రముఖ జ్యోతిష్యుడు

Advertisment
Advertisment
తాజా కథనాలు