Hyderabad: కోకాపేటలో బిడ్డర్లకు ఎక్కువ భూమి..హెచ్‌ఎండీఏ సర్వే

కోకాపేటలో నియోపోలిస్ లే అవుట్‌, బుద్వేల్‌లలో బిడ్డర్లు ఎక్కువ భూమిని పొందారని హెచ్‌ఎండీఏ అనుమానిస్తోంది. లే అవుట్‌లను అభివృద్ధి చేసే క్రమంలో కొలతల సమస్య వల్లే ఇలా జరిగిందని చెబుతోంది. దీని మీద స్పష్టత కోసం ఇప్పుడు మళ్ళీ తాజాగా సర్వేను చేపట్టింది.

New Update
Hyderabad: కోకాపేటలో బిడ్డర్లకు ఎక్కువ భూమి..హెచ్‌ఎండీఏ సర్వే

HMDA Land Survey In Kokapet: కోకాపేట్‌లో , బుదవేల్‌లో భూములను హెచ్‌ఎండీఏ మళ్ళీ సర్వే చేస్తోంది. ప్రభుత్వం ఇక్కడ భూములను వేలం వేసినప్పుడు బిడ్డర్లకు ఎక్కువ భూమి వెళ్ళిపోయిందని అనుమానిస్తోంది హెచ్‌ఎండీఏ. లే అవుట్‌లను అభివృద్ధి చేసే క్రమంలో కొలతల సమస్య వల్లే ఇలా జరిగిందని అనుమానిస్తోంది. అందుకే దీని స్పష్టత వచ్చేందుకు మళ్ళీ అక్కడ భూములను సర్వే చేపట్టింది. ఇలా బిడ్డర్లకు ఎక్కువ భూమి రావడం వల్ల కంపెనీలకు 1‌‌‌‌‌‌‌‌000 చదరపు గజాలు అధికంగా లభించినా.. ప్రభుత్వానికి దాదాపు 20 కోట్ల నష్టం వాటిల్లితుందని అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం కోకాపేటలో చదరపు గజం రెండు లక్షలు పలుకుతోంది. దాదాపు రూ.300 కోట్ల వరకు ఆస్తులను బిడ్డర్లకు రిజిస్ట్రేషన్ చేయాలని రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ హెచ్‌ఎండీఏపై ఒత్తిడి తెస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దాదాపు రూ.300 కోట్ల వరకు ఆస్తులను బిడ్డర్లకు రిజిస్ట్రేషన్ చేయాలని రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ హెచ్‌ఎండీఏపై ఒత్తిడి తెస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

దీంతో 2006లో వేలం వేసిన గోల్డెన్ మైల్ ప్రాజెక్ట్‌తో సహా కోకాపేట్ భూమిని హెచ్‌ఎండీఏ ప్రస్తుతం సర్వే చేస్తోంది. ఈ సర్వే బుద్వేల్ లేఅవుట్‌ను కూడా కవర్ చేస్తోంది. ఎలక్ట్రానిక్ టోటల్ సిస్టమ్ (ETS), భౌతిక ధృవీకరణ సహాయంతో కొలతలు తీసుకునే ప్రక్రియలో ఉన్నామని హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ చెపారు. కోకాపేటలోని నియోపోలీస్‌లో ప్రభుత్వం రెండు దశల్లో సుమారు 95 ఎకరాలను వేలం వేసింది. 2021 జూన్‌లో జరిగిన మొదటి దశ వేలం ద్వారా దాదాపు రూ. 2,000 కోట్లు రాగా... ఆగస్టు 2023లో జరిగిన రెండో దశ ద్వారా ప్రభుత్వానికి రూ. 3,300 కోట్లు వచ్చాయి. ఇక బుద్వేల్‌లో గత ఏడాది 100 ఎకరాల విస్తీర్ణంలో భూములు విక్రయించగా.. ప్రభుత్వానికి రూ.3,625 కోట్లు వచ్చాయి. అలాగే గోల్డెన్ మైల్ ప్రాజెక్ట్ భూమిని 2006లో విక్రయించారు.

Also Read: Jharkhand: ఈనెల 30న బీజేపీలోకి చంపయ్ సోరెన్..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Raj Tarun: ఎట్టకేలకు అజ్ఞాతం వీడిన యంగ్ హీరో..

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ 'పాంచ్ మినార్'తో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. సినిమా టీజర్ విడుదలై ప్రమోషన్స్ షురూ అయ్యాయి. గత వివాదాల తర్వాత పెద్దగా కనిపించలేదు రాజ్, తాజాగా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందు ప్రత్యక్షమయ్యాడు. 

New Update
Raj Tarun

Raj Tarun

Raj Tarun: టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రాజ్ తరుణ్ గురించి చెప్పాలంటే, అతని స్టైల్ కొంచెం ప్రత్యేకమే. కేవలం సినిమా ప్రమోషనన్స్ టైమ్ లో మాత్రమే కనిపించి, తర్వాత పూర్తిగా మాయమవ్వడం అతని అలవాటుగా కనిపిస్తోంది. మూవీ రిలీజ్ టైమ్ లో తప్ప మిగతా రోజుల్లో  ఏమాత్రం అప్‌డేట్స్ లేకుండా మాయమయిపోతుంటాడు.

Also Read: నరరూప రాక్షసుడిని చూస్తారు.. మే 1న థియేటర్లలో కలుద్దాం: నాని

అయితే ఇక్కడ విషయం ఏంటంటే, రాజ్ తరుణ్ లాగానే అతని సినిమాలు కూడా అంతే త్వరగా మాయమవుతాయి. ఏ ప్రాజెక్ట్ చేస్తున్నాడో, టైటిల్ ఏంటి, ఎప్పుడు విడుదలవుతుందో ఇవేమి ఎవరికీ తేలేదు. సడన్ గా కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తుంటాడు.

‘పాంచ్ మినార్’ ప్రమోషన్స్..

అయితే ఈ సారి కూడా అదే జరిగింది,  రాజ్ తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చాడు. ‘పాంచ్ మినార్’(Paanch Minar) అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. చిత్ర బృందం టీజర్‌ను లాంచ్ చేసింది. ఇకపై సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్‌ను వరుసగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. విడుదల కూడా త్వరలోనే ఉండబోతుందట.

Also Read: ‘కేజీఎఫ్‌ చాప్టర్‌-2’: రాఖీ భాయ్ విధ్వంసానికి మూడేళ్లు!

ఇదంతా పక్కనపెడితే, గతంలో రాజ్ తరుణ్ పై వచ్చిన వ్యక్తిగత వివాదం అందరికీ గుర్తుండే ఉంటుంది. లావణ్య అనే మహిళ రాజ్ తరుణ్ తన భర్త అని మీడియా ముందుకొచ్చి సంచలనం సృష్టించింది. ఆ వివాదం పెద్ద చర్చకు దారితీసినా, చివరికి ఆమెనే మళ్లీ అతనికి క్షమాపణలు చెప్పింది. తన ఆరోపణలకు తానే క్లారిటీ ఇవ్వడంతో, రాజ్ తరుణ్ తిరిగి తెరపైకి వస్తాడని అందరూ భావించారు.

Also Read: బాలయ్య ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే న్యూస్..

అయితే ఆ వివాదం సద్దుమణిగాక  కూడా రాజ్ తరుణ్ మాత్రం మౌనం వీడలేదు, కావాలనే అజ్ఞాతం లోకి వెళ్ళాడో, లేదంటే ప్లాన్డ్ సైలెన్స్‌లో ఉన్నాడో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇప్పుడు మరోసారి సినిమా విడుదల దశకు చేరుకోవడంతో మీడియా ముందుకొచ్చిన రాజ్ తరుణ్, సినిమా ప్రమోషన్స్ ముగిసిన తర్వాత మళ్లీ మాయమవుతాడా? అన్నది ప్రెశ్నగా మారింది.

Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..

Advertisment
Advertisment
Advertisment