Hyderabad: కోకాపేటలో కాసుల వర్షం.. ఎకరం భూమి రూ.151 కోట్లు
రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం కోకాపేటలో భూములు మరోసారి రికార్డు ధరలు పలికాయి. తాజాగా ఎకరం భూమి ఏకంగా రూ.151.25 కోట్లు ధర పలికింది.
రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం కోకాపేటలో భూములు మరోసారి రికార్డు ధరలు పలికాయి. తాజాగా ఎకరం భూమి ఏకంగా రూ.151.25 కోట్లు ధర పలికింది.
బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌రావుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రెండోరొజు భేటీ అయ్యారు. హరీష్ రావు పార్టీ మారుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో కేటీఆర్ ఆయనతో రెండోరోజు సమావేశమవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.
హైదరాబాద్ కోకాపేట్లో భారీ పేలుళ్లతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఓ నిర్మాణ సంస్థ డిటోనెటర్లు పెట్టి బ్లాస్టింగ్ చేయగా పెద్ద బండరాళ్లు గాల్లోకి లేచి ఎగిరిపడ్డాయి. పలువురికి గాయాలవగా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కోకాపేటలో నియోపోలిస్ లే అవుట్, బుద్వేల్‌లలో బిడ్డర్లు ఎక్కువ భూమిని పొందారని హెచ్ఎండీఏ అనుమానిస్తోంది. లే అవుట్లను అభివృద్ధి చేసే క్రమంలో కొలతల సమస్య వల్లే ఇలా జరిగిందని చెబుతోంది. దీని మీద స్పష్టత కోసం ఇప్పుడు మళ్ళీ తాజాగా సర్వేను చేపట్టింది.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఎకరం రూ.100 కోట్లు విలువ చేసే 11 ఎకరాల భూమిని మొత్తం కేవలం రూ.37.43 కోట్లకు కేటాయించారని న్యాయవాది ఎ.వెంకట్రామిరెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టనుంది.
హైదరాబాద్ లోని కోకాపేట్ లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. రూబెల్ షేక్ అనే వ్యక్తి నయన్ పహారియాపై రాడ్డుతో దాడి చేయడంతో అక్కడికక్కడే చనిపోయాడు. రూబెల్ పరారీలో ఉండగా వీరిద్దరూ బెంగాల్ నుంచి వచ్చిన వలస కార్మికులుగా పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్ కోకాపేట భూములు రికార్డు స్థాయిలో ధర పలికాయి. నియోపొలిస్ లే అవుట్ లోని 45.33ఎకరాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ఏడు ప్లాట్లను ఈ వేలం ద్వారా విక్రయించారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో గురువారం జరిగిన భూముల ఈ వేలం ద్వారా జరిగిన విక్రయంలో దేశ వ్యాప్తంగా పలు దిగ్గజ కంపెనీలు పాల్గొనన్నాయి. భూముల వేలంలో తెలంగాణ భూములకు రికార్డుస్థాయి ధర పలికింది.