Investment Schemes : మహిళల కోసం ప్రత్యేక స్కీమ్.. తక్కువ పెట్టుబడి.. అధిక రాబడి!

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం, ఎల్‌ఐసీ ఆదర్షి పథకం, సుకన్య సమృద్ధి యోజన స్కీమ్స్‌లో మహిళలు పెట్టుబడి పెట్టవచ్చు. సుకన్య సమృద్ధి యోజనలో 8.2శాతం వడ్డిరేటు ఉంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకంలో 7.5 శాతం వడ్డీని పొందవచ్చు!

New Update
Investment Schemes : మహిళల కోసం ప్రత్యేక స్కీమ్.. తక్కువ పెట్టుబడి.. అధిక రాబడి!

Best Investment Schemes For Women's : నేటి ఆధునిక యుగంలో మహిళలు (Women's) కూడా పురుషులతో భుజం భుజం కలిపి ముందుకు సాగుతున్నారు. ప్రయివేటు రంగం, వ్యాపారం, ప్రభుత్వం ఇలా అనేక చోట్ల పని చేస్తూ నేడు మహిళలు మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. అయితే దేశంలో చాలా మంది మహిళలకు ఆర్థిక అక్షరాస్యత లేదు. ఈ కారణంగా మహిళలకు తమ డబ్బును ఎక్కడ, ఎలా, ఏ పద్ధతిలో పెట్టుబడి పెట్టాలనే దానిపై సరైన అవగాహన లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో అద్భుతమైన పథకాలు అమలు చేస్తోంది. ఈ పథకాలలో పెట్టుబడి (Investment Schemes) పెట్టడం ద్వారా మహిళలు చాలా మంచి రాబడిని పొందుతున్నారు. ఇక ఈ పథకాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా వారు వడ్డీ రేటులో రాయితీని కూడా పొందుతారు. ఈ క్రమంలో మ‌హిళ‌ల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం ప్రారంభించిన ఆ అద్భుత‌మైన పథకాల గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాం.

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం: మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం (Mahila Samman Savings Certificate Scheme) ప్రత్యేకంగా మహిళల కోసం ప్రారంభించారు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మహిళలు 7.5 శాతం వడ్డీని పొందుతున్నారు. మీరు ఈ పథకంలో రూ. 2 లక్షలు పెట్టుబడి పెడితే, 7.5 శాతం వడ్డీ రేటు ఆధారంగా, రెండేళ్ల తర్వాత మెచ్యూరిటీ సమయంలో మీరు రూ. 2,32,044 పొందుతారు. మహిళలు మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజనలో గరిష్టంగా రెండేళ్ల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

సుకన్య సమృద్ధి యోజన : ముఖ్యంగా ఆడపిల్లల భవిష్యత్తును కాపాడేందుకు సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana) ను ప్రారంభించారు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ప్రస్తుతం 8.2 శాతం వడ్డీ రేటును పొందుతున్నారు. మీ కుమార్తె వయస్సు 10 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే, మీరు సమీపంలోని పోస్టాఫీసును సందర్శించడం ద్వారా ఈ పథకం కింద మీ కుమార్తె ఖాతాను తెరవవచ్చు.

ఎల్‌ఐసి ఆదర్షి :
ఎల్‌ఐసీ ఆధార్‌శిల పథకం (LIC Aadhaar Shila Scheme) మహిళల కోసం అమలు చేస్తున్న గొప్ప పథకం. ఇది నాన్-లింక్డ్ వ్యక్తిగత జీవిత బీమా పథకం. 8 సంవత్సరాల బాలికల నుంచి 55 సంవత్సరాల వయస్సు గల మహిళలు ఎల్‌ఐసీ ఆధార్‌శిల పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన తర్వాత, మీరు మెచ్యూరిటీ సమయంలో నిర్ణీత మొత్తాన్ని పొందుతారు.

Also Read: జులైలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Stock Markets: టారీఫ్ లకు బ్రేక్..ఆసియా, వాల్ స్ట్రీట్ స్టాక్ మార్కెట్లో జోష్

సుంకాలకు బ్రేక్ ఇస్తున్నామని అధ్యక్షుడు ట్రంప్ చెప్పడంతో స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. ఈరోజు ఆసియా మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అమెరికాలో కూడా మార్కెట్లు రికార్డ్ స్థాయిలో లాభపడ్డాయి. మహావీర్ జయంతి కారణంగా భారత స్టాక్ మార్కెట్లకు సెలవు. 

author-image
By Manogna alamuru
New Update
stock market

ప్రతీకార సుంకాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కు తగ్గారు. 90 రోజుల పాటూ టారీఫ్ లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.  దీంతో కొన్ని రోజులుగా అతలాకుతలం అవుతున్న ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఈరోజు పుంజుకున్నాయి. అమెరికా మార్కెట్లు రికార్డ్‌ స్థాయిలో లాభాలను ఆర్జించగా.. ఆసియా మార్కెట్లు కూడా కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్లు 12% పెరిగాయి. ఆసియా మార్కెట్లు కూడా 10% పెరిగాయి. మహావీర్ జయంతి సెలవుదినం కారణంగా భారత మార్కెట్లు మాత్రం మూసివేయడ్డాయి. 

ఆసియా మార్కెట్లు..

జపాన్ నిక్కీ ఇండెక్స్ 2,660 పాయింట్లు అటే 8.39% పెరిగి 34,370 వద్దకు చేరుకుంది. కొరియా కోస్పి ఇండెక్స్ 110 పాయింట్లు అనగా 4.70% పెరిగి 2400 వద్దకు చేరుకుంది. తైవాన్‌కు చెందిన TAIEX సూచీ 620 పాయింట్లు లేదా 9.35% పెరిగి 19,020 వద్దకు చేరుకుంది. షాంఘై సూచీ మాత్రం స్వల్పంగా 0.6శాతం లాభంతో కొనసాగుతోంది. 

24 ఏళ్ళ తర్వాత సూపర్ డే..

టారీఫ్ లపై ట్రంప్ ప్రకటన తర్వాత బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా దూసుకెళ్లాయి. డౌ జోన్స్ 2,962 పాయింట్లు లేదా 7.87% పెరిగి 40,608 వద్ద ముగిసింది. 2020 ఇది మార్చి నమోదైన అతిపెద్ద లాభం. అలాగే S&P 500 ఇండెక్స్ 9.52% పెరిగి 5,456.90కి చేరుకుంది.  2008 తర్వాత  S&P 500 ఇండెక్స్ అతిపెద్ద సింగిల్-సెషన్ పెరుగుదల ఇది.  మరోవైపు టెక్ స్టాక్స్ ఇండెక్స్ అయిన నాస్డాక్ కాంపోజిట్ 12.16% పెరిగి 17,124 కు చేరుకుంది. నాస్‌డాక్‌ ఒక రోజులో ఇలా రికార్డ్‌ స్థాయిలో లాభపడడం 24 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. వాల్ స్ట్రీట్ లో దాదాపు 30 బిలియన్ షేర్లు ట్రేడ్ అయ్యాయి. దీంతో బుధవారం వాల్ స్ట్రీట్ చరిత్రలో అత్యధికంగా ట్రేడ్ అయిన రోజుగా నిలిచింది.

 today-latest-news-in-telugu | stock-markets | asia | trump tariffs 

Also Read: USA: సైనిక చర్యలు తప్పువు..ఇరాన్ డీల్ పై ట్రంప్ మరోసారి..

Advertisment
Advertisment
Advertisment