Cricket:మిగిలిన టెస్ట్‌ల్లోనూ కోహ్లీ ఆడటం లేదు..బీసీసీఐ

ఇంగ్లాండ్‌తో మిగిలన మూడు టెస్ట్ మ్యాలకు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లూ ఆడని విరాట్ కోహ్లీ మిగతా మూడింటికి కూడా రావడం లేదని చెప్పింది. జడేజా, కె.ఎల్ .రాహుల్ మాత్రం ఆడతారని అనౌన్స్ చేసింది.

New Update
Cricket:మిగిలిన టెస్ట్‌ల్లోనూ కోహ్లీ ఆడటం లేదు..బీసీసీఐ

India vs England Test series:ఇండియా, ఇంగ్లాండ్‌ ల మధ్య ఐదు టెస్ట్‌ల సీరీస్ జరుగుతోంది. వీటిలో ఇప్పటికే రెండు మ్యాచ్ అయిపోయాయి. ఇందులో ఒకటి ఇంగ్లాండ్ గెలిస్తే...ఇంకోటి టీమ్ ఇండియా గెలిచింది. ఇప్పుడు మిగిలిన మూడు టెస్ట్ మ్యాచ్‌లకు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లకూ దూరమైన స్టార్ బ్యాట్స్‌మ్యాన్ విరాట్ కోహ్లీ ఇప్పుడు మిగిలిన మూడు టెస్ట్ట మ్యాచ్‌లను కూడా ఆడటం లేదు. మరోవైపు గాయాలతో రెండో టెస్ట్ ఆడని జడేజా, కె.ఎల్ రాహుల్‌ లు మాత్రం తిరిగి జట్టులోకి వస్తున్నారు.

Also Read:Interim Budget 🔴: తెలంగాణ అసెంబ్లీలో మధ్యంతర బడ్జెట్-హైలెట్స్

విరాట్ నిర్ణయాన్ని గౌరవిస్తాం..

వ్యక్తిగత కారణాలతో విరాట్ టెస్ట్ మ్యాచ్‌లకు దూరమవుతున్నాడని చెబుతోంది బీసీసీఐ. వినాట్ నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని అంటోంది. ఇక కె.ఎల్. రాహుల్, జడేజాలు మూడో టెస్ట్ నాటికి ఫిట్ నెస్ క్లియరెన్స్ వస్తే వారిద్దరూ తుది జట్టులో ఉంటారని తేల్చి చెప్పింది. అప్పటి వరకు వారి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోమని తెలిపింది. మరోవైపు మూడో టెస్ట్‌కు సిరాజ్‌ కూడా అందుబాటులోకి వచ్చేశాడు. కొత్తగా ఆకాశ్‌ దీప్‌ టెస్టులకి ఎంపికయ్యాడు. రజత్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. గాయం కారణంగా శ్రేయస్‌ అయ్యర్ ఆడటం లేదు. ఇషాన్‌ కిషన్‌, మహమ్మద్‌ షమీని పరిగణనలోకి తీసుకోలేదు. రాజ్‌ కోట్‌ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి మూడో టెస్టు మ్యాచ్‌ మొదలవనుంది. నాలుగో టెస్టు ఫిబ్రవరి 23 నుంచి రాంచీలో .. ఐదో మ్యాచ్‌ మార్చి 7న ధర్మశాలలో జరగనున్నాయి.

మూడు టెస్ట్‌లకు భారత జట్టు..

రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్‌ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్‌ గిల్, కేఎల్ రాహుల్, రజత్‌ పటీదార్, సర్ఫరాజ్‌ ఖాన్, ధ్రువ్‌ జురెల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్‌ యాదవ్, సిరాజ్, ముకేశ్‌ కుమార్, ఆకాశ్‌ దీప్‌

Advertisment
Advertisment
తాజా కథనాలు