USA Elections: కమలా హారీస్‌కు మద్దతిచ్చిన బరాక్‌ ఒబామా.. వీడియో వైరల్

డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారీస్‌కు.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతిచ్చారు. హారీస్‌కు ఫోన్‌ చేసి మద్దతు ఇచ్చినట్లు ఆయన ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. అమెరికాకు హారిస్‌ మంచి అధ్యక్షురాలు అవ్వగలదని భావిస్తున్నామని.. ఆమెకు మా పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.

New Update
USA Elections: కమలా హారీస్‌కు మద్దతిచ్చిన బరాక్‌ ఒబామా.. వీడియో వైరల్

డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారీస్‌కు.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతిచ్చారు. హారీస్‌కు మద్దతు ఇచ్చినట్లు ఆయన ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. ' ఈ వారం నేను, మిచెల్‌ కలిసి మా స్నేహితురాలు కమలా హారిస్‌కు ఫోన్ చేశాం. అమెరికాకు ఆమె మంచి అధ్యక్షురాలు అవ్వగలదని భావిస్తున్నామని చెప్పాం. ఆమెకు మా పూర్తి మద్దతు ఉంటుంది. ఇప్పుడు మన దేశానికి ఉన్న క్లిష్టమైన పరిస్థితుల్లో.. ఆమె నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో గెలిచేందుకు ఏదైనా చేస్తాం. మీరు కూడా మాతో పాటే మద్దతిస్తారని ఆశిస్తున్నాం' అంటూ బరాక్‌ ఒబామా ట్వీట్‌ చేశారు. కమలా హారీస్‌తో మాట్లాడిన వీడియోను కూడా జతచేశారు.

Also Read: ఐటీలో చేరాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. 90 వేల కొత్త ఉద్యోగాలు

ఇదిలాఉండగా.. ఇప్పటికే డెమొక్రటిక్‌ పార్టీ తరపున అధ్యక్ష రేసు నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకున్న సంగతి తెలిసిందే. అధ్యక్ష అభ్యర్థిగా ఇప్పటికే ఆయన కూడా కమలా హారిస్‌కే మద్దతిచ్చారు. కానీ ఆ తర్వాత మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మద్దతివ్వకపోవడంపై అనేక అనుమానాలు తలెత్తాయి. చివరికి ఒబామా దంపతులు.. కమలా హారిస్‌కు మద్దతును ప్రకటించడంతో డెమొక్రటిక్‌ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి మృతి..

Advertisment
Advertisment
తాజా కథనాలు