మాంచి ఊపుమీదున్న బాలయ్య.. ఒకేసారి ముగ్గురు భామలతో రొమాన్స్!

ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ తాజాగా బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ వైరల్ అవుతున్నాయి. ఇందులో బాలకృష్ణ మూడు కోణాల్లో కనిపించనుండగా ఆయన సరసన ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నట్లు తెలుస్తోంది.

New Update
మాంచి ఊపుమీదున్న బాలయ్య.. ఒకేసారి ముగ్గురు భామలతో రొమాన్స్!

Balayya New Movie Crazy Update : టాలీవుడ్ (Tollywood) సీనీయర్ హీరో బాలకృష్ణ కుర్రహీరోలకంటే వేగంగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అంతేకాదు యంగ్ హీరోలతో కోట్లు ఖర్చుపెట్టి తీసిన సినిమాలు ఎక్కువశాతం బాక్సాఫీస్ వద్ద డిజాస్ట్రర్ అవుతుంటే.. బాలయ్య (Balakrishna) నటించిన సినిమాలు భారీ వసూళ్లు రాబడుతున్నాయి. ఇటీవల ఆయన నటించిన ఏ సినిమా కూడా అభిమానులను, నిర్మాతలను నిరాశపరచలేదు. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్లు సైతం బాలయ్యబాబుతో నటించేందుకు రెడీ అవుతున్నారు. కాజోల్, నయనతార, శ్రీలీల, ప్రగ్వా జైస్వాల్, ఊర్వశీ రౌతేలా వంటి బాలీవుడ్ భామలు కూడా బాలయ్య మూవీ అంటే కళ్లు మూసుకుని ఒప్పేసుకుంటున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో బాలయ్య క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది.

publive-image

Also read :TTD Jobs : టీటీడీలో ఉద్యోగాలు..జీతం రూ. 50వేలకు పైనే..ఈ అర్హతలు ఉంటే దరఖాస్తు చేసుకోండి..!!

అయితే ఇటీవలే అనిల్ రావిపూడి (Anil Ravipudi)దర్శకత్వంలో 'భగవంత్ కేసరి' సినిమాతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన బాలయ్య.. మరో యంగ్ డైరెక్టర్ బాబీతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఇందుకు సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ మేరకు బాబీ దర్శకత్వంలో రాబోతున్న సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తుండగా.. ఈ చిత్రం భిన్న కాలాల్ని ప్రతిబింబించే కథతో రూపొందుతుందట. ఆ కథ సాగే కాలానికి తగ్గట్టుగానే బాలకృష్ణ మూడు కోణాల్లో కనిపిస్తారని తెలుస్తోంది.

publive-image

అంతేకాదు ఆయన సరసన ముగ్గురు కథానాయికలు నటిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఊటీలో చిత్రీకరణ జరుగుతుండగా.. బాలకృష్ణ, కథానాయిక ఊర్వశీ రౌతేలాతోపాటు ఇతర తారాగణంపై సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీలో మీనాక్షి చౌదరితోపాటు మరో స్టార్ హీరోయిన్ కూడా నటించబోతుందని సమాచారం. ఇందుకు సంబంధించిన అధికారక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

HariHaraVeeraMallu Release: వీరమల్లు విడుదల డౌటే..? పవన్ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్

పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ 'హరిహర వీరమల్లు' మరోసారి వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. మే 9న విడుదల కానుండగా.. ఇంకా షూటింగ్ పనులు పెండింగ్ ఉన్నట్లుగా సమాచారం. పవన్ ఆరోగ్యం, అలాగే కొడుకుకు ప్రమాదం జరగడం ఆలస్యానికి కారణమని టాక్.

New Update

HariHaraVeeraMallu Release:  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరోసారి షాక్ తగిలింది. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన  'హరిహర వీరమల్లు' మళ్ళీ పోస్ట్ ఫోన్ కానున్నట్లు తెలుస్తోంది. నాలుగేళ్ళ క్రితం మొదలుపెట్టిన ఈ సినిమాకు ఇంకా థియేటర్ మోక్షం కలగడం లేదు. మే 9న విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించగా.. షూటింగ్ పనులు ఇంకా పెండింగ్ ఉండడంతో మళ్ళీ వాయిదా వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వారం పవన్ కు సంబంధించిన షూట్ పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆయన కుమారుడు అగ్ని ప్రమాదానికి గురవడం, పవన్ ఆరోగ్యం కూడా బాగోలేకపోవడంతో  షెడ్యూల్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీంతో అనుకున్న టైంకి మూవీని  రిలీజ్ చేయగలమా? లేదా అనే  టెన్షన్ లో ఉన్నారు మేకర్స్. మరోవైపు  ఫ్యాన్స్ కూడా  తీవ్ర నిరాశ చెందుతున్నారు.  ఇప్పుడు రిలీజ్ కాకపోతే..? ఇకపై  'హరిహరవీరమల్లు' విడుదల డౌటే? అని కామెంట్లు పెడుతున్నారు కొంతమంది. 

Also Read: HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. 'హిట్ 3' ట్రైలర్ ట్రెండింగ్ .. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!

ఇప్పటికే మూడు సార్లు

ఇప్పటికే ఈ చిత్రాన్ని మూడు సార్లు పోస్ట్ ఫోన్ చేశారు.  మొదటగా 2021లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేయగా.. కరోనా కారణంగా  2022 మార్చి 28కి పోస్ట్ ఫోన్ చేశారు. ఆ తర్వాత  2023, 2024లో పవన్ రాజకీయాలతో బిజీ అయిపోవడంతో 2025 మార్చి 28కి రిలీజ్ వాయిదా వేశారు. అయితే అప్పటికి కూడా ఈ సినిమా చూసే భాగ్యం దక్కలేదు  ఫ్యాన్స్ కి. మళ్ళీ మే 9కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు టాక్. 

మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై AM. రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని  క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్, బాబీ డియోల్, ఎం. నాసర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిఇలా ఉంటే ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాకు సూపర్ బజ్ క్రియేట్ చేశాయి. 

cinema-news | latest-news | harihara-veeramallu-movie

Also Read: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

Advertisment
Advertisment
Advertisment