Chandrababu:ఇన్నర్ రింగ్ కేసు బెయిల్ పిటిషన్ విచారణ వచ్చేనెల 7కు వాయిదా

ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్మెంట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణను వచ్చేనెల 7వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. మరోవైపు ఈరోజు చంద్రబాబుతో ములాఖత్ కోసం లోకేష్ ఢిల్లీ నుంచి రానున్నారు.

New Update
Chandrababu:ఏపీ హైకోర్టులో నేడు చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ

ఇన్నర్ రింగ్ రోడ్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ వాదనలు జరిగాయి. ఇప్పటికే ఇన్నర్ రింగ్ కేసులో 500 పేజీల కౌంటర్ దాఖలు చేసింది సీఐడీ. ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్మెంట్ మార్చడం ద్వారా చంద్రబాబు కుటుంబ సభ్యులు, మాజీ మంత్రి నారాయణ, లింగమనేని‌ రమేష్ లకు లబ్ది చేకూర్చారని కౌంటర్ లో పేర్కొంది సీఐడీ. మరోవైపు.. లేని ఇన్నర్ రింగ్ రోడ్ పై కేసు నమోదు చేసిందని ఆరోపిస్తున్నారు చంద్రబాబు తరపు అడ్వకేట్లు. దీని మీద ఇవాళ కూడా వాదనలు జరిగాయి. అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల 7వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. మరోవైపు CDR పిటిషన్ను కరెక్షన్ చేసి తీసుకురావాలని చంద్రబాబు తరపు న్యాయవాదులకు ఎసిబి కోర్టు సూచించింది.
లీగల్ ప్రొవిజన్ ప్రకారం పిటీషన్ లోని అంశాలను ప్రస్తావించాలని చెప్పింది. మధ్యాహ్నం తరువాత CDR పై ఎసీబి కోర్టు వాదనలు విననుంది.

Also Read:జీవితబీమాపై బీజెపీ ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్…ఫైర్ అయిన కవిత

ఇక టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని ఈ రోజు నారా లోకేష్ రాజమండ్రి జైలులో కలవనున్నారు. చంద్రబాబుతో కోర్టు విచారణ విషయాలను చర్చించే అవకాశం ఉంది. చంద్రబాబుతో ములాఖత్ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిపై నారా లోకేష్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే లోకేష్ ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గన్నవరం నుంచి రాజమండ్రికి లోకేష్ రోడ్డు మార్గంలో వెళ్లనున్నారు. నిన్న క్వాష్ పిటిషన్ కు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచడం, ఫైబర్ నెట్ కేసులో బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడడం తదితర అంశాలపై లోకేష్ చంద్రబాబుతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు అనారోగ్యానికి గురయ్యారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ములాఖత్ అనంతరం చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి లోకేష్‌ ప్రకటన చేసే అవకాశం ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు