World cup 2023:ఖాతా తెరిచిన ఆస్ట్రేలియా-శ్రీలంక మీద విజయం

2023 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా మొత్తానికి తమ మొదటి విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంకపై ఐదు వికెట్లతో ఘనవిజయం సాధించింది. 210 పరుగుల లక్ష్యాన్ని 35.2 ఓవర్లలో ఆస్ట్రేలియా ఛేదించింది.

New Update
World cup 2023:ఖాతా తెరిచిన ఆస్ట్రేలియా-శ్రీలంక మీద విజయం

వరల్డ్ కప్ 2023‌లో ఆస్ట్రేలియా మొదటి విజయం అందుకుంది. శ్రీలంకతో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 43.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్ అయింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 35.2 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది. దీంతో ఆస్ట్రేలియా పాయింట్ల పట్టికలో పదో స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి చేరుకుంది. నాలుగు వికెట్లు తీసుకున్న ఆడం జంపాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ లో జోష్ ఇంగ్లిస్ (58: 59 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్), మిషెల్ మార్ష్ (52: 51 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు) అర్థ సెంచరీలు సాధించారు. చివర్లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ (31 నాటౌట్: 21 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు), మార్కస్ స్టోయినిస్ (20 నాటౌట్: 10 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) వేగంగా ఆడి మంచి రన్‌రేట్ తీసుకువచ్చారు. అంతకు ముందు శ్రీలంక ఓపెనర్లు పతుం నిశ్శంక (61: 67 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు), కుశాల్ పెరీరా (78: 82 బంతుల్లో, 12 ఫోర్లు) ఫిఫ్టీలు చేశారు.

ఆస్ట్రేలియా బ్యాటర్లు డేవిడ్ వార్నర్ (11), స్టీవ్ స్మిత్‍(0)ను లంక పేసర్ దసున్ మధుశనక ఒకే ఓవర్లో ఔట్ చేశాడు. దీంతో 24 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యఛేదనలో కష్టాల్లో పడింది ఆస్ట్రేలియా. అయితే, మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ దూకుడుగా ఆడాడు. తన మార్క్ హిట్టింగ్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతడికి మార్నస్ లబుషేన్ (40) సహకరించాడు. ఈ క్రమంలో 39 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన మార్ష్.. కాసేపటికే రనౌట్‍గా వెనుదిరిగాడు.అనంతరం లబుషేన్‍కు జోస్ ఇంగ్లిస్ జతకలిశాడు. ఇద్దరూ కలిసి నిలకడగా పరుగులు రాబట్టారు. దీంతో 26.5 ఓవర్లలోనే ఆస్ట్రేలియా స్కోరు 150 పరుగులకు చేరింది. తర్వాత వచ్చిన లబుషేన్ ఔటైనా ఇంగ్లిస్ జోరు కొనసాగించాడు. 46 బంతుల్లోనే అర్ధ శతకం చేశాడు. అయితే, ఇంగ్లిస్‍ను 34వ ఓవర్లో ఔట్ చేశాడు లంక స్పిన్నర్ వెల్లలాగే. చివర్లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ (31 నాటౌట్), మార్కస్ స్టోయినిస్ (20 నాటౌట్) వేగంగా ఆడటంతో పాటు మరో వికెట్ పడకుండానే ఆస్ట్రేలియాను గెలిచేలా చేశారు.

ముందు టాస్ గెలిచిన శ్రీలంక మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు పతుం నిశ్శంక (61: 67 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు), కుశాల్ పెరీరా (78: 82 బంతుల్లో, 12 ఫోర్లు) శ్రీలంక ఇన్నింగ్స్‌కు అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. ఒకానొక దశలో 21.3 ఓవర్లలో 125-0 స్కోరుతో పటిష్ట స్థితిలో కనిపించిన శ్రీలంక ఊహించని రీతిలో 84 పరుగుల వ్యవధిలో మొత్తం 10 వికెట్లనూ కోల్పోయింది. 43.3 ఓవర్లలో 209 పరుగులకు కుప్పకూలిపోయింది. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా నాలుగు వికెట్లతో లంక బ్యాటింగ్ లైనప్‍ను కూల్చాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు జంపాకే దక్కింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam ప్రకృతి అందాలతో పహాల్గమ్.. ఇక్కడ టాప్ 10 పర్యాటక ప్రదేశాలు చూస్తే మతిపోతుంది!

నిన్న జరిగిన ఉగ్రవాద దాడితో జమ్మూకాశ్మీర్ లోని పహాల్గమ్ ప్రదేశం పేరు మారుమోగుతోంది. మినీ స్విట్జర్ ల్యాండ్ గా పేరొందిన పహల్గామ్ మంచుతో కప్పబడిన పర్వతాలు, లోయలు, నదులతో ఉత్సాహభరితమైన ప్రకృతి దృశ్యాలను తలపిస్తుంది. పహాల్గమ్ లోని కొన్ని సుందరమైన పర్యాటక ప్రదేశాల గురించి ఇక్కడ తెలుసుకుందాం

New Update
Pahalgam Terror Attack

Pahalgam Terror Attack Photograph: (Pahalgam Terror Attack)

Advertisment
Advertisment