Assam: ముస్లిం పెళ్ళి, విడాకుల చట్టాన్ని రద్దు చేసిన అస్సాం రాష్ట్రంలోని ముస్లిం వివాహాలు-విడాకులకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న చట్టాన్ని తొలగించాలని డిసైడ్ అయింది అస్సాం ప్రభుత్వం. దానికి బదులుగా పెళ్ళిళ్ళు, విడాకులకు ప్రభుత్వ నమోదును తప్పనిసరి చేసే బిల్లును ఆమోదించింది. By Manogna alamuru 30 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Repeal Muslim Marriages Divorce Act: యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేసే దిశగా అస్సాం ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దానిలో భాగంగా రాష్ట్రంలో ముస్లిమ్ వివాహాలు, విడాకుల విషయంలో చట్టాలను మారుస్తోంది. ఇప్పటివరకు ఉన్న ముస్లిం వివాహాలు మరియు విడాకుల నమోదు చట్టం-1935ని రద్దు చేసింది. ఇక మీదట ముస్లిమ్‌లు పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, విడాకులు తీసుకోవాలన్నా ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ విషయంపై ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ..ఇంతకు ముందు జరిగిన వివాహాల రిజిస్ట్రేషన్లన్నీ చెల్లుబాటు అవుతాయని, కొత్తవి మాత్రమే చట్టం పరిధిలోకి వస్తాయని చెప్పారు. ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఇస్లామిక్ ఆచారాల ప్రకారం జరిగే వివాహాల్లో తాము అస్సలు జోక్యం చేసుకోమని తెలిపారు. మా ఏకైక షరతు ఏమిటంటే ఇస్లాం నిషేధించిన వివాహాలు మాత్రం నమోదు చేయబడవు అని తెలిపారు. వీటితో పాటూ కొత్త చట్టం ప్రకారం బాల్య వివహాలను పూర్తిగా నిషేధిస్తుందని సీఎం హిమంత బిశ్వా తెలిపారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ, కాజీలు గతంలో జరిపిన వివాహాల రిజిస్ట్రేషన్లన్నీ చెల్లుబాటు అవుతాయని, కొత్తవి మాత్రమే చట్టం పరిధిలోకి వస్తాయని అన్నారు. ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఇస్లామిక్ ఆచారాల ప్రకారం జరిగే వివాహాలకు మేము అస్సలు జోక్యం చేసుకోవడం లేదు. మా ఏకైక షరతు ఏమిటంటే ఇస్లాం నిషేధించిన వివాహాలు నమోదు చేయబడవు అని అన్నారు. సామాజిక దురాచారాలను పూర్తిగా నిర్మూలించడమే తమ లక్ష్యమని చెప్పారు. బాలికలకు 18, బాలకులకు 21 ఏళ్ళ వయసుని చట్టబద్ధం చేసింది అస్సాం ప్రభుత్వం. ఈ బిల్లు బాల్యవివాహాలను నిరోధించడంతో పాటు ఆడ పిల్లలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించే సాధనం, బహు భార్యత్వాన్ని నిషేధిస్తుందని అన్నారు. గతంలో ముస్లిం వివాహాలు కాజీలు అమలుపరిచేవారు. వీటి ద్వారా బాల్య వివాహాలు జరిగేవి. వీటిపై ప్రభుత్వ పర్యవేక్షణ కూడా లేదు. Also Read: Africa: ఆకలి తీర్చడానికి వన్యప్రాణుల వధ..ఆఫ్రికాలో కరువు తాండవం #marriage #divorce #assam #muslim #act మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి